రాముడు - సీత
స్వరూపం
ఆడటానికి చాలా సరదాగా ఉండే ఈ ఆటను 3 నుండి ఆరుగురు ఆడవచ్చు.
కావలసినవి
[మార్చు]ఈ ఆటకు కావలసినవి రెండు అంగుళాలు ఉన్న ఆరు కాగితం ముక్కలు, స్కోరుకి ఒక కాగితం, ఒక కలం.
ఆడు విధానం
[మార్చు]ఆట పెద్ద కాగిత ముక్కల పై రామాయణం కావ్యంలో పాత్రల పేర్లు వ్రాస్తాడు. ఈ ఆటలో రాముడు - 5000, సీత - 0, భరతుడు - 2000, శత్రుఘ్నడు - 1000, హనుమంతుడు -4000 అని వ్రాసి కాగితాలను గుండ్రంగా చుట్టాలి. ఆట పెద్ద చుట్టూ కూర్చున్న వారికి గుండ్రంగా చుట్టిన కాగితాలను నేలమీద వేయాలి. వెంటనే ఎవరికి ఇష్టం వచ్చిన కాగితం వారు తీసుకుంటారు. రాముడు ఎవరో ముందు చెప్పాలి. ఆ తర్వాత రాముడు వచ్చినవారు సీత ఎవరికొచ్చిందో ఊహించి చెప్పగలగితే 5000 మార్కులు వస్తాయి. తప్పు చెబితే 0 మార్కులు. సీత వచ్చిన వారికి 1000 మార్కులు పడతాయి. మిగతావారందరికీ వారి వారి మార్కులు వేయాలి. పది ఆటల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారు విజేత. [1]
మూలాలు
[మార్చు]- ↑ పెద్దబాల శిక్ష - గాజుల సత్యనారాయణ, వనజ ఆప్ సెట్ ప్రింటర్స్, విజయవాడ