రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజ నాయకర్ (కీరా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌ (1923 - 2021) తమిళంలో మాండలిక రచనల పితామహుడిగా గుర్తింపు పొందాడు. 'నా రచనలకు తమిళం శరీరమైతే ఆత్మ తెలుగే' అని సగర్వంగా చెప్పుకొనే కీరా- మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, కమల్‌హాసన్‌ తదితరులెందరికో అభిమాన రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌ 1923 సెప్టెంబర్‌ 16న లక్ష్మమ్మ, కృష్ణ రామానుజ నాయకర్‌ దంపతులకు జన్మించాడు. అతను తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి మండలం ఇడైచేవల్‌ గ్రామానికి చెందినవాడు[2]. అతను తెలుగు మూలాలు కలిగిన రచయిత, కథకుడు. అయిదో తరగతితో చదువు ఆపేసినా పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఫోక్ టేల్స్, డాక్యుమెంటేషన్ సర్వే సెంటర్ డైరెక్టర్ గా పని చేసాడు. అతను తమిళంలో సుమారు 30 పుస్తకాల ను రచించాడు. 1991లో 'గోపల్లాపురతు మక్కల్' అనే నవల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇది ఆ కాలక్రమంలో ఎంతోమందికి ఆవాసమైన ఆ గ్రామం స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎలా ఉండేదో చెబుతూ రాసిన నవల .[3]

అతను 2021 మే 17న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "తమిళ ఒడిలో తెలుగు నుడి". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.
  2. https://web.archive.org/save/https://m.eenadu.net/vyakyanam/article/general/1302/121102561
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-21. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు[మార్చు]