రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే"
సంగీతంఎం.ఎం.కీరవాణి
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణ1993
భాషతెలుగు
రూపంవిషాద గీతం
గాయకుడు/గాయనిఎం.ఎం.కీరవాణి

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే మాతృదేవోభవ (1993) సినిమాలోని విషాద గీతం. దీనిని వేటూరి సుందరరామమూర్తి రచించారు. ఈ గేయాన్ని ఎం.ఎం.కీరవాణి హృద్యంగా గానం చేసి సంగీతం కూడా అందించారు.

నేపథ్యం

[మార్చు]

శారద (మాధవి), ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. సంగీత అధ్యాపకురాలిగా పనిచేస్తుంటుంది. సత్యం (నాజర్) లారీ డ్రైవర్ శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. శారదకు మెదడు క్యాన్సర్ సోకిందనీ, తను ఇక ఎంతో కాలం బ్రతకదనీ డాక్టర్లు చెబుతారు. అప్పారావు పగబట్టి సత్యాన్ని చంపేస్తాడు. శారద తనలాగే తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరి సారిగా పిల్లలందర్నీ దీపావళికి తన చేతుల్తో ఆదరించాలని కోరుకొంటున్న నేపథ్యంలో ఈ పాటను మాధవి మీద చిత్రీకరించారు.

పల్లవి :

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం ||| రాలిపోయె పువ్వా |||

అవార్డు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]