రావుల పుల్లాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావుల పుల్లాచారి
Ravula Pullachary.jpeg
జననంమే 10, 1950
జాతీయతభారతీయుడు
వృత్తికవి, కథా, నాటక రచయిత
తల్లిదండ్రులుధశరధం, ఈశ్వరమ్మ

రావుల పుల్లాచారి (జ. మే 10, 1950) కవి, కథా, నాటక రచయిత. నంది నాటక పరిషత్తు - 2016 లో రచ్చబండ నాటికకు ఉత్తమ ద్వితీయ రచయితగా నంది అవార్డు అందుకున్నాడు.[1]

జననం[మార్చు]

పుల్లాచారి 1950, మే 10న ధశరధం, ఈశ్వరమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ లో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]

హుజూరాబాద్, హన్మకొండ లలో పాఠశాల విద్యను చదివిన పుల్లాచారి, జమ్మికుంట ఆదర్శ కళాశాలలో బి.కాం. పూర్తిచేశాడు. హన్మకొండలోని ఇరిగేషన్ డిపార్టుమెంటులో సూపరిండెంట్ గా పనిచేసి 2008, మే 31న పదవి విరమణ చేశాడు.

రచ్చబండ నాటికకు ద్వితీయ ఉత్తమ రచయిత అవార్డు అందుకుంటున్న పుల్లాచారి

రచనా ప్రస్థానం[మార్చు]

పుల్లాచారి రాసిన కథలు, కవితలు, వ్యాసాలు వివిధ దిన వార పత్రికల్లో ప్రచురించబడ్డాయి.[2]

కథలు[మార్చు]

 1. అమ్మెరు
 2. చెల్లని పైసలు
 3. గచ్చుపూత[3]
 4. సర్కస్
 5. రచ్చబండ
 6. భల్లూక బంధం
 7. ద బిస్సి
 8. భాగస్వామ్యం
 9. ఆట
 10. బెత్తెడు జాగ
 11. బరువు
 12. అంబుధి
 13. బంధం
 14. రిక్షాతాత
 15. కొ..క్క..రో..కో..
 16. కొలిమి చల్లారింది
 17. ఖరామృతము
 18. అదిగో పాము
 19. మనసు గదిలో
 20. బతుకమ్మ కానుక
బెత్తెడు జాగ పుస్తకావిష్కరణ

నాటికలు[మార్చు]

 1. బాకీపడ్డ బతుకులు
 2. పతనం దిక్కు పరుగు
 3. ఈ వేస్తున్న అడుగు ఎటు?
 4. శ్రామిక శకటం
 5. పోతే పోనియ్
 6. రచ్చబండ
 7. మనసు చెక్కిన శిల్పం
 8. గంగిగోవుపాలు
 9. పేతాత్మదిగిరా
 10. దేశం పోకడ చూడరబాబు

ప్రచురించిన పుస్తకాలు[మార్చు]

 1. నాలోకి (ఆధ్యత్మిక వ్యాస సంపుటి)
 2. బెత్తెడు జాగ (కథా సంపుటి)[4]

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

 1. ఉత్తమ ద్వితీయ రచయిత - రచ్చబండ (నంది నాటక పరిషత్తు - 2016)[1][5]
 2. తుమ్మల రంగస్థల సాహితీ పురస్కారం, కరీంనగర్
 3. తెలుగు వెలుగు విశిష్ట సాహితీ పురస్కారం (2008-2009) తెలుగు భాషా సంరక్షణ సంఘం, జగిత్యాల.
 4. ఉత్తమ రచయిత (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "ఉత్తమ రచనగా రచ్చబండ". Retrieved 10 May 2018.[permanent dead link]
 2. ఆంథ్రభూమి, సాహితీ (25 July 2016). "కాలం ఎత్తుగడ". Retrieved 10 May 2018.
 3. అజో విభో కుందాళం ఫౌండేషన్ వెబ్. "గచ్చుపూత కథ" (PDF). www.avkf.org. Retrieved 10 May 2018.
 4. నమస్తే తెలంగాణ, పుస్తక పరిచయం (15 May 2016). "బెత్తెడు జాగ ఓ అనుబంధాల అల్లిక". అశోక్. Retrieved 10 May 2018.
 5. ప్రజాశక్తి. "ఘనంగా కందుకూరి, నంది పురస్కారాల ప్రదానోత్సవం". Retrieved 10 May 2018.