రావుసాహెబ్ అంతపుర్కర్
రావుసాహెబ్ అంతపుర్కర్ | |||
పదవీ కాలం (2009-2014), (2019 – 2021) | |||
ముందు | భాస్కరరావు బాపురావ్ ఖట్గాంకర్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | జితేష్ అంతపుర్కర్ | ||
నియోజకవర్గం | డెగ్లూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2021 ఏప్రిల్ 9 | (వయసు 62)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | జితేష్ అంతపుర్కర్ | ||
నివాసం | డెగ్లూర్ , మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రావుసాహెబ్ అంతపుర్కర్ (12 ఆగష్టు 1958 - 9 ఏప్రిల్ 2021) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు డెగ్లూర్ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రావుసాహెబ్ అంతపుర్కర్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు విజిలెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తూ రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సుభాష్ పిరాజీ సబ్నేపై 6011 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికలలో శివసేన అభ్యర్థి సుభాష్ పిరాజీ సబ్నే చేతిలో 8648 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
రావుసాహెబ్ అంతపుర్కర్ 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డెగ్లూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సుభాష్ పిరాజీ సబ్నేపై 22433 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మరణం
[మార్చు]రావుసాహెబ్ అంత్‌పుర్కర్ 9 ఏప్రిల్ 2021న కోవిడ్ అనంతర సమస్యల కారణంగా మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (10 April 2021). "Maharashtra Congress MLA Raosaheb Antapurkar dies due to post-COVID complications" (in Indian English). Retrieved 25 October 2024.
- ↑ India Today (10 April 2021). "Maharashtra: Congress MLA Raosaheb Antapurkar dies of Covid-19" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
- ↑ The Times of India (11 April 2021). "Congress MLA dies of Covid in Mumbai hospital". Retrieved 25 October 2024.