రావూరి దొరస్వామిశర్మ
స్వరూపం
(రావూరి దొరసామిశర్మ నుండి దారిమార్పు చెందింది)
రావూరి దొరస్వామిశర్మ | |
---|---|
జననం | రావూరి దొరస్వామిశర్మ 1919 |
విద్య | ఎం.ఎ., బి.ఓ.యల్. |
వృత్తి | అసిస్టెంట్ ప్రొఫెసర్ |
ఉద్యోగం | వైష్ణవ కళాశాల, మద్రాసు |
ప్రసిద్ధి | రచయిత, విమర్శకుడు, కవి, పరిశోధకుడు |
Notable work(s) | అప్పకవీయ భావప్రకాశిక తెలుగు భాషలో ఛందోరీతులు శ్రీ ఘటికాచల నరసింహ శతకము కవితాసాగరము |
మతం | హిందూ |
రావూరి దొరస్వామిశర్మఛందస్సుపై విశేష కృషి చేసిన పరిశోధకుడు. ఇతనికి కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇతడు ఎం.ఎ., బి.ఓ.ఎల్. చదివాడు. మద్రాసులోని వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక, పరిశోధన, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు, సాహితీ వాల్లభ్యము మొదలైన పత్రికలలో 1940 - 1968ల మధ్యకాలంలో అనేక పరిశోధనా వ్యాసాలు, ఛందస్సుకు సంబంధించిన వ్యాసాలు ప్రకటించాడు.
వాటిలో కొన్ని మచ్చుకు:
- సంజయుడెవడు?
- ఛందో దర్పణ సమీక్ష
- రామాయణము: సుమిత్రమాగధి
- క్రౌంచపద వృత్త లక్షణ విశేషములు
- ముద్దరాజు రామయ్య - కవిజన సంజీవని
- నన్నయ రచనలోని వళి ప్రాసములు
- పాల్కురికి వారి ప్రావళ్ళు
- వరూథి - అవరూథి
- విశ్వనాథ ప్రయోగ వైలక్షణ్యము - సమీక్ష
- కవిజనాశ్రయము - భీమన ఛందము
ఇతని ముద్రిత గ్రంథాలలో కొన్ని:
- అప్పకవీయ భావప్రకాశిక
- లక్షణ శిరోమణి (పొత్తపి వేంకటరమణకవి ప్రణీతము - సంపాదకత్వం)[1]
- తెలుగు సాహిత్యము - రామకథ
- తెలుగు భాషలో ఛందోరీతులు
- లింగమగుంట తిమ్మకవికృత సులక్షణసారము
- అన్యాపదేశ శతకము
- అప్పకవీయము (సమీక్ష) [2]
- కవితాసాగరము
- దక్షిణదేశపుకథలు (అనువాదము, బాలసాహిత్యము)
- ఆముక్తమాల్యద (వచనానువాదం విశ్వనాథ సత్యనారాయణతో కలిసి)
- తెలుగులో తిట్టుకవిత్వము
- దేవవ్రతుడు
- మిత్రమణిభూషణము
- శ్రీ ఘటికాచల నరసింహ శతకము
- ఆంధ్ర లక్షణ సంగ్రహము
- ఘటికాచల క్షేత్ర మహత్యము (వచనం)
- కవిచింతామణి