రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా

వికీపీడియా నుండి
(రెండవ ఇబ్రహీం ఆదిల్ షా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా

రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా (1556 – 1627 సెప్టెంబరు 12) ఆదిల్ షాహీ వంశానికి చెందిన బీజాపూరు సుల్తాను. ఈయన పాలనలో ఆదిల్ షాహీ రాజ్యం ఉఛ్ఛస్థాయికి చేరుకొని, దక్షిణాన మైసూరు వరకు విస్తరించింది. అందుకే ఆదిల్‌షాహీ స్వర్ణశకంగా ఈయన పాలనాకాలాన్ని భావిస్తారు. ఇబ్రహీం ఆదిల్‌షా పాలనా కోవిదుడు, కళాకారుడు, కవి[1], ఉదార కళాపోషకుడు. తన పూర్వీకులకు భిన్నంగా సున్నీ ఇస్లాంను అవలంబించాడు. అయినా, క్రైస్తవంతో సహా ఇతర మతాల పట్ల మతసహనం వహించాడు. ఈయన పాలన తర్వాత, రాజ్యం క్షీణించి దక్షిణాదిన మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అవకాశం కల్పించింది. మరాఠా చక్రవర్తి శివాజీ తిరుగుబాటుకు అవకాశాన్నిచ్చింది. శివాజీ, బీజాపూరు సైన్యాధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ ను హతమార్చి, ఆయన సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఆదిల్ షాహీ వంశం అంతర్జాతీయ సంస్కృతి, సంప్రదాయాలను మిగిల్చింది. వీరి కళాపోషణ, శిల్పనైపుణ్యం, రాజధాని అయిన బీజాపూరులో ఉన్న కట్టడాలలో మిగిలిపోయింది.

మూలాలు[మార్చు]

  1. Schimmel, Annemarie (2004). Burzine K. Waghmar (ed.). The Empire of the Great Mughals: History, Art and Culture. Corinne Attwood, translator. Reaktion Books. p. 39. ISBN 978-1-86189-185-3.