రెండో ప్రపంచయుద్ధమా?

రెండో ప్రపంచయుద్ధమా? అనేది రెండవ ప్రపంచయుద్ధం గురించిన వ్యాసాల సంకలనం. దీనిని ఆంధ్రకేసరి గ్రంథమాల వారు రెండు భాగాలుగా 1940లో ముద్రించారు. వీనికి బూర్గుల రంగనాథరావు, అందుగుల తిరుమలరావు, అవురుపల్లి కృష్ణారావు సంపాదకులుగా వ్యవహరించారు.
పుస్తకంలోని అంశాలు
[మార్చు]"వివిధరాజ్యముల యొక్క వాదములను, దేశ ముల యొక్క స్థితిగతులను ౧౯౧ర నుండి ౧౯రం వరకు జరిగిన సంధి సంప్రతింపులను, ఆ మూలాగ్రముగా ఉదహరించి, విషయములను కూలంకషముగా చర్చింపకున్నను పుస్తకము ఇంతగా. పెరిగి పోవుటచే దీనిని రెండుభాగములలో ముద్రింపవలసివచ్చెను. అయినను ముఖ్య విషయము లేవియు వదలి వేయబడలేదు. ప్ర కాశ కు ల యొక్కయు, గ్రంధకర్త యొక్కయు అభిప్రాయము, మొదటినుండియు పత్రికలు చదువలేక అంతర్జాతీయ పరిస్థితులను తెలసికొనక యుండిన సర్వసామాన్య ఆక్షరాస్యు ఈ పుస్తకము సుబోధకముగా నుండవలయునని. విద్యార్థులకు గూడ సహాయకారియగునని మా తలంపు, సాధ్యమయినంతవకు వ్యావహారిక భాష వాడబడినది." అని రచయిత ముందు మాటలో తెలియజేసారు.[1]
విషయసూచిక
[మార్చు]- యుద్ధజూదములో పందెములేమిటి ?
- వెర్సాయిల్సు సంధి.
- జర్మనీ తలయెత్తింది.
- లీగుకు అగ్నిపరీక్ష.
- సమిష్టి క్షేమవిధానము.
- సమిష్టి క్షేమమే శరణ్యము.
- సాంత్వన నీతి.
- క్షణిక శాంతి.
