రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్
రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తుర్కియే (టర్కీ) అధ్యక్షుడు,. 2023 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 2023 జూన్ మూడో తేదీన మూడోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1] ఇటీవల జరిగిన తుర్కియే అధ్యక్ష ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కు 52.18 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం 2023 జూన్ 1వ తేదీన ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా ప్రధానిగా, అధ్యక్షుడిగా వేర్వేరు పదవులు నిర్వహించిన 69 సంవత్సరాల రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తాజా ఎన్నికతో 2028 సంవత్సరం వరకు తుర్కియే అధ్యక్షుడిగా కొనసాగునున్నాడు.[2] 2003 సంవత్సరం నుండి అనగా దాదాపు 20 సంవత్సరాలుగా ఎర్డోగాన్ ప్రధానమంత్రి గాను, అధ్యక్షుడిగాను తుర్కియే ను పాలిస్తూ వస్తున్నాడు.[3] 2017 సంవత్సరంలో జనాభిప్రాయ సేకరణ అనంతరం తుర్కియే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్షతన పాలనకు మారింది. అప్పటినుంచి 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారే దేశానికి గాని, రాష్ట్రాలకు గాని సారధిలవుతారనే నియమం వచ్చింది.[4]
ములాలు
[మార్చు]- ↑ "Hatrick President: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-05-29. Retrieved 2023-09-15.
- ↑ ABN (2023-05-29). "Turkey election: టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోడాన్ మూడో సారి విజయం". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-15.
- ↑ gargi.chaudhry. "Turkey election 2023: Recep Tayyip Erdogan wins another term as President, world leaders congratulate him". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
- ↑ Latha, Suma (2023-05-29). "టర్కీ అధ్యక్షుడిగా మరోసారి రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-15.[permanent dead link]