రెస్పెలెండెట్ క్వెట్జల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెసోఅమెరికన్ పురాణశాస్త్రం ప్రకారం క్వెట్జల్ వివిధ రకాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది గ్వాటెమాల జాతీయ పక్షి. చిత్రం దేశం యొక్క జెండా మరియు కోట ఆయుధాలు కనిపిస్తాయి . గ్వాటెమాల దేశ కరెన్సీ నోట్లపై క్వెట్జల్‌ పక్షి చిత్రం ఉంటుంది.

వర్గీకరణ[మార్చు]

సున్నితమైన క్వెట్జల్ మొట్టమొదటిసారిగా మెక్సికన్ ప్రకృతి శాస్త్రవేత్త పాబ్లో డి లా లేవ్వే 1832 లో గుర్తించారు.

వివరణ[మార్చు]

ప్రపంచంలోనే అందమైనదిగా గుర్తింపు పొందిన పక్షి. పక్షుల్లో చాలా రకాలున్నాయి. కానీ అందులో ఒక పక్షి మాత్రం ప్రపంచంలోనే అందమైన పక్షిగా గుర్తింపు పొందింది. సెంట్రల్‌ అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ పక్షి ఆకుపచ్చ, నీలం మరియుఎరుపు రంగుల్లో ఉంటుంది.పొడవైన తోకలు మగపక్షులకు మాత్రమే ఉంటాయి. ఇవి 3 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. మగపక్షికి హెల్మెట్‌ మాదిరిగా తలపై పెద్ద కుచ్చు ఉంటుంది.

పక్షి ఆహారం[మార్చు]

పండ్లు, బల్లులు, చిన్న చిన్న కీటకాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది.

ప్రత్యేకత[మార్చు]

గ్వాటెమాల దేశ సంస్కృతితో పక్షికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందమైన పక్షిగా పేరుగాంచినది కానీ తక్కువ ఎత్తు మాత్రమే ఎగురుతుంది. ఈ పక్షి యెక్క ఈకలు చాలా పవిత్రమైనవిగా ఆదేస ప్రజలు భావిస్తారు. పూజారులు వేడుకల్లో ఆ ఈకలను ధరిస్తారు. ఈ అందమైన పక్షులు అంతరించిపోకుండా చూసుకోవడం కోసం పరిశోధకులు కృషి చేస్తున్నారు.