రేకందార్ ఇందిరాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేకందార్ ఇందిరాదేవి
నివాస ప్రాంతంవిజయవాడ
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
తండ్రివనారస అబ్బాజీరావు
తల్లితిరుపతమ్మ

రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి.

జననం

[మార్చు]

ఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

బాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు స్త్రీ పాత్రలను అవలీలగా ప్రేక్షక జనరంజకంగా అభినయించింది. మాయాబజార్ లో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్రను కూడా ధరించి ప్రశంసలందుకొన్నది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ‘బి’ హైగ్రేడ్ ఆర్టిస్ట్ గా అనేక శ్రవ్య నాటకాలలో నటించిన ఈమె ఎన్నో అవార్డులు - రివార్డులు, సత్కారాలు, సన్మానాలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందుతూ శేష జీవితాన్ని గడుపుతున్నది.

మూలాలు

[మార్చు]
  • రేకందార్ ఇందిరాదేవి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 26.