రేడియోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేడియోగ్రఫీ
Xraymachine.JPG
అధునాతన ఎక్స్-రే యంత్రం సాయంతో మోకాలికి ఎక్స్-రే తీస్తున్న దృశ్యం
Systemకణజాల, ఎముకల వ్యవస్థ
SubdivisionsInterventional, Nuclear, Therapeutic, Paediatric
Significant diseasesక్యాన్సర్, ఎముకలు విరగడం
Significant testsస్క్రీనింగ్ టెస్ట్, ఎక్స్-రే, సిటి, ఎం.ఆర్.ఐ, పి.యి.టి, బోన్ స్కాన్, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రఫీ, ఫ్లోరోస్కోపీ
Specialistరేడియోగ్రాఫర్

రేడియోగ్రఫీ అనేది ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, లేదా వాటిని పోలిన అయొనైజింగ్ లేదా నాన్-అయొనైజింగ్ రేడియేషన్ సాయంతో ఒక వస్తువు యొక్క అంతర్గత నిర్మాణాన్ని బొమ్మ రూపంలో చిత్రీకరించే విధానం. దీనికి వైద్యశాస్త్రంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సకోసం, ఇంకా పరిశ్రమలలోనూ ఉపయోగాలు ఉన్నాయి. దీనినే విమానాశ్రయ భద్రత కోసం కూడా వాడతారు. సాంప్రదాయిక రేడియోగ్రఫీలో ఒక ఎక్స్-రే జెనరేటర్ నుంచి కిరణాలు ఉత్పత్తి అయి వస్తువు మీద పడతాయి. వీటిలో కొంత భాగాన్ని ఆ వస్తువు సాంద్రత, కూర్పును బట్టి శోషించుకుంటుంది. వస్తువు గుండా ప్రయాణించి దాటి వెళ్ళే కిరణాలను ఫోటోగ్రఫిక్ ఫిల్ము కానీ, డిజిటల్ డిటెక్టర్ గానీ గ్రహించి ద్విమితీయ (Two dimensional) చిత్రాన్ని ఏర్పరుస్తుంది. దీనినే ప్రొజెక్షనల్ రేడియోగ్రఫీ అంటారు.

కపాలపు రేడియోగ్రాఫ్

కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సిటి)[మార్చు]

కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా CT స్కాన్ (గతంలో CAT స్కాన్ అని పిలుస్తారు, "A" అంటే "యాక్సియల్") మృదువైన, కఠినమైన కణజాల చిత్రాలను రూపొందించడానికి కంప్యూటర్‌తో కలిపి అయానైజింగ్ రేడియేషన్ (x-ray రేడియేషన్)ను ఉపయోగిస్తుంది. ఈ చిత్రాలు రోగిని రొట్టెలాగా ముక్కలు చేసినట్లుగా కనిపిస్తుంది. (టోమో అంటే స్లైస్ లేదా ముక్క అని అర్థం). సిటి స్కాన్ లో డయోగ్నస్టిక్ ఎక్స్-రేలు కాకుండా ఎక్కువ స్థాయిలో అయొనైజింగ్ ఎక్స్-రేలను ఉపయోగిస్తారు. సాంకేతిక ఎక్కువయ్యే కొద్దీ వీటి స్థాయి, సిటి స్కాన్ కి పట్టే సమయం తగ్గుతూ వస్తోంది.[1] పరీక్షించవలసిన కణజాలాన్ని బట్టి ఈ సిటి పరీక్ష ఒకసారి ఊపిరి తీసుకునేంత తక్కువ వ్యవధిలోనే అయిపోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Jang J, Jung SE, Jeong WK, Lim YS, Choi JI, Park MY, et al. (February 2016). "Radiation Doses of Various CT Protocols: a Multicenter Longitudinal Observation Study". Journal of Korean Medical Science. 31 (Suppl 1): S24-31. doi:10.3346/jkms.2016.31.S1.S24. PMC 4756338. PMID 26908984.