రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి
(రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి | |
---|---|
రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి | |
జననం | రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి 1920 ఆగస్టు 20 జన్మ స్థలము |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ఇతర పేర్లు |
విద్య | విద్యార్హత |
వృత్తి | వృత్తి |
పనిచేయు సంస్థ | |
తల్లిదండ్రులు | తల్లి దండ్రుల పేర్లు |
పురస్కారాలు | సాధించిన పురస్కారాలు |
రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి బహుగ్రంథకర్త. ఆయన ఆధ్యాత్మికాంశాలపై గ్రంథరచన చేశారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ఆగష్టు 20, 1920లో జన్మించారు. ఆయన కృష్ణ యజుర్వేదం (ఘనాంతం), తైతిరీయ శాఖ, శ్రౌతం (కల్ప శాస్త్రం) ఆపస్తంబ సూత్రం, లక్షణ శాస్త్రం, విద్యారణ్య భాష్యం, మీమాంస సూత్రములను అధ్యయనం చేసారు.[1] ఆయన రాజమండ్రి లోని శ్రీ గౌతమీ విద్యా పీఠం సంస్కృత కళాశాల యొక్క ప్రధానాచార్యుడుగా పదవీవిరమణ చేసారు.విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి వీరి శిష్యులు. సూర్యప్రకాశశాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతికి అనేక సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదు ల లోని అనేక వేద శాస్త్ర పరిషత్తులకు గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు.
- 1961 : రాజమండ్రి వేద శాస్త్ర పరిషత్ చే "సాంగ వేదార్థ సమ్రాట్ " బిరుదు.
- 1969 : విజయవాడ వేద శాస్త్ర పరిషత్ వారిచే "అభినవ విద్యారణ్య" బిరుదు.
- 1970 : హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే "వేద భాష్య పండితుడు"గా గుర్తింపు.
- 1978 : కేరళలో జరిగిన అఖిలభారత విద్వత్ సమ్మేళనంలో కంచికామకోటి పీఠాధిపతి శ్రీచంద్ర శేఖరేంద్ర సరస్వతి చే "శాస్త్ర రత్నాకర" బిరుదు.
- 1985 : వారణాసి లోని శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేదమీమాంసానుసంధాన కేంద్రం ద్వారా "వేదమీమాంస సార్వభౌమ" బిరుదు.
- 1990 : రాష్ట్రపతి పురస్కారం ( వేదం, సంస్కృత పండిత పురస్కారం ఆర్.వెంకటరామన్, రాష్ట్రపతి ద్వారా)
- 1996 : రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం (సెంట్రల్ విశ్వవిద్యాలయం), తిరుపతి వారిచే "మహామహోపాధ్యాయ" బిరుదు.
- 1998 : మైసూరు లోని శ్రీ గణపతి సచ్చిదానంద వారిచే "వేదనిథి" బిరుదం.
- 2002 : బెంగళూరు లోని శ్రీ భారతీయ విద్యాభవన్ వారిచే "వేదరత్న" బిరుదం.
- వేదార్థోపన్యాసములు ( 700 పేజీల వేదార్థ ఉపన్యాసాలు)
- సంస్కృతంలో "నిత్య కామ్య కర్మ మీమాంస"
- "వేదార్థ జ్ఞాన దీపిక" తెలుగులో (2 సంపుటాలు)
మూలాలు
[మార్చు]- ↑ "eminent scholars". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.
- ↑ "ఆయనకు వచ్చిన అవార్డులు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.
- ↑ "ప్రచురణలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-18.
ఇతర లింకులు
[మార్చు]వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- 1920 జననాలు
- ఆధ్యాత్మిక గురువులు
- ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు
- తెలుగు రచయితలు
- సంస్కృత పండితులు
- తెలుగు పుస్తక జాబితాలు
- మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- తూర్పు గోదావరి జిల్లా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా ఆధ్యాత్మిక వ్యక్తులు