Jump to content

రేయాన్

వికీపీడియా నుండి
రేయాన్ ఉత్పత్తి చేసే విధానం

రేయాన్ (Rayon) లేదా విస్కోస్ (Viscose) ఒక అర్ధ కృత్రిమ నార (Semi synthetic fiber).[1] దీనిని కలప, ఇంకా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల లాంటి సహజమైన రీజెనరేటెడ్ సెల్యులోజ్ నుంచి తయారు చేస్తారు.[2] దీని అణు నిర్మాణం సెల్యులోజ్ లాగే ఉంటుంది. దీనిలో చాలా రకాలు, స్థాయిలు ఉన్నాయి. కొన్ని రేయాన్లు పట్టు, ఉన్ని, నూలు లాంటి స్పర్శ, అల్లికను అనుకరిస్తాయి.

సెల్యులోజ్ ను ద్రావణంలో కరిగించడం ద్వారా వివిధ రూపాల్లో ఉన్న రేయాన్ ను ఉత్పత్తి చేయవచ్చు.

చరిత్ర

[మార్చు]

ఫ్రెంచి శాస్త్రవేత్త అయిన హిలైర్ డీ షార్డొనెట్ (1838-1924) మొదటిసారిగా ఈ నేత సంబంధమైన కృత్రిమ దారాన్ని కనుగొన్నాడు.[3]

స్విస్ రసాయన శాస్త్రవేత్త అయిన మథియాస్ ఎడ్వర్డ్ ష్వీజర్ సెల్యులోజ్ ని టెట్రాఅమైన్ కాపర్ డైహైడ్రాక్సైడ్ ద్రావణంలో కరిగించడం ద్వారా రేయాన్ ఉత్పత్తి చేయవచ్చు అని తెలుసుకున్నాడు. 1897 లో మాక్స్ ఫ్రెమరీ, జోహన్ అర్బన్ అనే శాస్త్రవేత్తలు లైట్ బల్బులో వాడకంకోసం కార్బన్ ఫైబర్ ని ఉత్పత్తి చేయడానికి ఒక విధానం కనుగొన్నారు.[4]

ఆంగ్ల రసాయన శాస్త్రవేత్తలు చార్లెస్ ఫ్రెడరిక్ క్రాస్, అతని సహాయకులు ఎడ్వర్డ్ జాన్ బీవన్, క్లేటన్ బీడిల్ 1894 లో కృత్రిమ పట్టును పేటెంట్ చేసుకున్నారు. దీనికి వీరు విస్కోస్ అని పేరు పెట్టారు. ఎందుకంటే దీనిని ఉత్పత్తి చేయడానికి అత్యధిక స్నిగ్ధత కలిగిన ద్రావణం అవసరమయ్యేది.

మూలాలు

[మార్చు]
  1. Camille. "3 Basic Types of Fabric: Synthetic Fiber, Semi-Synthetic Fiber, & Natural Fiber Defined" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-04.
  2. Kauffman, George B. (1993). "Rayon: the first semi-synthetic fiber product". Journal of Chemical Education. 70 (11): 887. Bibcode:1993JChEd..70..887K. doi:10.1021/ed070p887.
  3. Woodings, Calvin R. "A Brief History of Regenerated Cellulosic Fibres". Woodings Consulting Ltd. Archived from the original on 22 ఏప్రిల్ 2012. Retrieved 26 May 2012.
  4. Over 100 years old and still going strong From Glanzstoff (artificial silk) factory to industry park. industriepark-oberbruch.de
"https://te.wikipedia.org/w/index.php?title=రేయాన్&oldid=4194570" నుండి వెలికితీశారు