రేవులపల్లి
రేవులపల్లి మహబూబ్ నగర్ జిల్లా, ధరూర్ మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తుంది.
జూరాల ప్రాజెక్టు
[మార్చు]ఇక్కడ నది ప్రవహించే ప్రాంతమంతా రాళ్ళగుట్టలతో నిండిపోవడం వలన, తెలంగాణ ముఖ్యప్రాజెక్టులలో ఒకటైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇక్కడ నిర్మించారు. ప్రాజెక్ట్ నిర్మించిన తొలి నాళ్ళలో ఇక్కడ పర్యాటకుల కొరకు అందమైన్ ఉద్యాన వనం ఉండేది. జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశాక అది పాడైపోయింది. విద్యుత్ కేంద్రం ఏర్పాటయ్యాక గ్రామంలోని ఉత్తర భాగంలో చాలా ఇళ్ళను వదిలి పెట్టవలసి వచ్చింది. వీరికి మరో చోట పునరావాసాన్ని ఏర్పాటు చేశారు.
సమీప గ్రామాలు
[మార్చు]ఈ గ్రామానికి చుట్టు పక్కల చిన్న చింతరేవుల, పెద్ద చింతరేవుల, గుడ్డెందొడ్డి, ఉప్పేరు తదితర గ్రామాలు ఉన్నాయి.
పాఠశాలలు
[మార్చు]గ్రామంలో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక, మరోటి ఉన్నత పాఠశాల. పదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. పదవ తరగతి విద్యార్థులు తమ చివరి పరీక్షలను దగ్గరలోని ఉప్పేరు కేంద్రంలో రాస్తుంటారు.
రక్షకభట నిలయం
[మార్చు]ఇది మండల కేంద్రం కాకపోయినా,ధరూర్ మండలానికి సంబంధించిన ప్రధాన రక్షక భట నిలయం ఇక్కడే ఉంది. ఉపకేంద్రం(ఔట్ పోస్ట్) మాత్రం మండల కేంద్రమైన ధరూర్లో ఉంది.
అతిధి గృహం
[మార్చు]ప్రాజెక్టును సందర్శించే అధికారులు, ప్రతినిధుల అవసరాల నిమిత్తం ఇక్కడ ఓ పెద్ద అతిథి గృహాన్ని నిర్మించారు.
ప్రాజెక్టు క్యాంప్
[మార్చు]జూరాల ప్రాజెక్టు పనుల నిమిత్తం ఇక్కడ కొన్ని కార్యాలయాలు, పని చేసే అధికారుల కొరకు కొన్ని నివాస ప్రాంతాలతో కూడిన క్యాంప్ ఉంది.
దేవాలయాలు
[మార్చు]ఇక్కడి క్యాంప్ ఆవరణలో ఆకర్షణీయమైన శ్రీసీతారామాలయం ఉంది. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులు ఇక్కడకు తప్పకుండా వస్తుంటారు. విశాలమైన పచ్చటి ఆవరణలో ఆలయం ఉండటం నలన, భక్తులే కాకుండా, పిల్లలు వినోదం కొరకు, పెద్దలు విశ్రాంతి కొరకు ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేస్తుంటారు.