రోజెర్ ఎబెర్ట్ (సినీ విమర్శకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Roger Ebert
Ebert giving an interview for Sound Opinions in 2007
పుట్టిన తేదీ, స్థలంRoger Joseph Ebert
(1942-06-18)1942 జూన్ 18
Urbana, Illinois, U.S.
మరణం2013 ఏప్రిల్ 4(2013-04-04) (వయసు 70)
Chicago, Illinois, U.S.
సమాధి స్థానంGraceland Cemetery
వృత్తిFilm critic, journalist, screenwriter, film historian, author
భాషEnglish
జాతీయతAmerican
విద్యUrbana High School
పూర్వవిద్యార్థి
విషయంFilm
పురస్కారాలుPulitzer Prize for Criticism
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు1967–2013
జీవిత భాగస్వామి
Chaz Hammelsmith
(m. 1992⁠–⁠2013)

సంతకం

Roger Joseph Ebert (/ˈbərt//ˈbərt/; June 18, 1942 – April 4, 2013) రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు, సినీ రచయిత, రోజెర్ 1967 నుండి 2013 వరకు షికాగో సన్-టైమ్స్ అనే పత్రికకు సినీ విమర్శకుడిగా పనిచేశాడు. 1975లో పులిట్జర్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి సినీ విమర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు.

ఎబెర్ట్, "షికాగో ట్రిబ్యూన్" పత్రికా సినీ విమర్శకుడు జెనె సిస్కెల్ ఇరువురూ కలిసి టివీలలో సినిమాలకి సంబంధించి సమీక్షలను అందించారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందినవి. అవి "స్నీక్ ప్రివ్యూస్", "ఎట్ ది మూవీస్" మొదలగు కార్యక్రమాలు ఇరువురూ కలిసి చేసినవి. వారిద్దరూ కలిసి తమ వాక్చాతుర్యం, ఛలోక్తులతో సినిమాలకు సంబంధించి వీక్షకులకు సినిమాలపై తమ అభిప్రాయాలను తెలిపేవారు.1999ల్ సిస్కెల్ మరణించిన తరువాత ఇతర వ్యాఖ్యాతలతో ఎబెర్ట్ ఈ కార్యక్రమమును కొనసాగించాడు.

షికాగో సన్-టమ్స్ కి చెందిన "నీల్ స్టీన్ బర్గ్ ఎబెర్ట్ గురించి " నిస్సందేహంగా రోజెర్ ఎబెర్ట్ దేశానికి చెందిన ఉన్నతమైన, ఎంతో ప్రభావశీలమైన సినీ విమర్శకుడని" తెలిపాడు.[1], ఫోర్బ్స్ పత్రికకు చెందిన సినీ విమర్శకుడు "టామ్ వైపర్" ఎబెర్ట్ను "ఎంతో శక్తివంతమైన సినీ పండితుడని" తెలిపాడు.[2]

రోజెర్ ఎబెర్ట్కు 2002లో అతని "లాలాజల గ్రంథులకు" (salivary glands‌),థైరాయిడ్కికాన్సర్ వ్యాధి సోకడం వలన అతడి క్రింది దవడను తొలగించవలసి వచ్చింది.దీని వలన అతడు ఆహారం తీసుకోలేకపోవడం మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందికి లోనయ్యాడు.ఈవ్యాధి అతడి రచనా వృత్తికి ఏమాత్రం అడ్డురాలేదు.అప్పటి నుండి తను మరణించే వరకు అంతర్జాలంలో సినీ సమీక్షలు అందిస్తూనే ఉన్నాడు. చివరికి ఏప్రిల్14, 2013లో మరణించాడు.

Notes[మార్చు]

References[మార్చు]

  1. Steinberg, Neil (April 4, 2013). "Roger Ebert dies at 70 after battle with cancer". Chicago Sun-Times. Archived from the original on December 16, 2014.
  2. Riper, Tom Van (September 24, 2007). "The Top Pundits in America". Forbes. Retrieved December 9, 2008.