Jump to content

కల్టివేటర్

వికీపీడియా నుండి
(రోటవేటర్ నుండి దారిమార్పు చెందింది)
F210 హోండా టిల్లర్

కల్టివేటర్ (రోటరీ టిల్లర్) అనేది వ్యవసాయ భూమిని తిరగ దున్నేందుకు ఉపయోగించే ఒక దున్నుడు పరికరం. ఇది నాటడానికి ముందు మట్టిని తవ్వి మెత్తగా చేస్తుంది. ప్రధాన సాగు యంత్రాలలో కల్టివేటర్ ఒకటి. విత్తనాలు నాటడం, కలుపు తొలగింపు కోసం నేల ఉపరితలం సిద్ధం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. కల్టివేటర్‌లు వివిధ సైజుల్లో, రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ట్రాక్టర్‌తో దున్నకం కోసం కల్టివేటర్‌లు వివిధ సైజుల్లో, వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. కల్టివేటర్ అనేది దున్నటానికి పొలాలలో ఉపయోగించే వ్యవసాయ సాధనం. పొలంలో నేల వాలులను విచ్ఛిన్నం చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా ట్రాక్టర్ ద్వారా దున్నకం చేసేటప్పుడు భూమిలోకి కొద్దిగా లోతుకు కల్టివేటర్ యొక్క నాగలి పళ్ళను అదిమిపెట్టి లాగి దున్నుతారు. ట్రాక్టర్ ద్వారా దున్నకం చేసేటప్పుడు కల్టివేటర్ నాగలి పళ్ళను సందర్భాన్ని బట్టి హైడ్రాలిక్ ద్వారా ఎత్తడం, దించడం ద్వారా భూమిని చదును చేస్తారు. కల్టివేటర్ యొక్క ఒక రకమైన తిరిగే డిస్క్‌ల ద్వారా వ్యవసాయ భూమి యొక్క నేలను తిరగ దున్నుతారు. విత్తనాలు నాటిన తరువాత లేదా పైరు పెరిగిన తరువాత కూడా సాళ్లలో దున్నేందుకు చిన్న సైజు రోటరీ టిల్లర్‌లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సైజు రోటరీ టిల్లర్‌లను ఒక వ్యక్తి నడుస్తూ నడిపించగలడు, ఇవి తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న రైతులు బాగా ఉపయోగిస్తున్నారు. రోటరీ టిల్లర్‌లు పొలంలోని మట్టి గడ్డలను పొడిగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇది రైతుకు చాలా ఉపయోగకరమైన యంత్రం. ఒక పైరు తరువాత మరో పైరు వేసుకొనుటకు అవసరమయితే మునుపటి పైరును మొక్కలతో సహా దీని ద్వారా తిరగ దున్నవచ్చు, మునుపటి మొక్కలు భూమిలోనే కలగలిసిపోయి సేంద్రీయ ఎరువుగా తయారయ్యిందుకు ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది.

చిన్న రోటరీ టిల్లర్ లను ఉపయోగించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]

1. వ్యవసాయ బూట్లను ధరించాలి, దీని వలన రోటరీ టిల్లర్ చక్రాల నుండి, పదునైన బ్లేడ్ల నుండి రక్షణ లభిస్తుంది.
2. రోటరీ టిల్లర్‌తో పనిచేసేటప్పుడు దుమ్ము, ధూళి కళ్ళల్లో పడకుండా సెఫ్టీ కళ్ళ అద్దాలను ఉపయోగించాలి