Jump to content

కలుపు మొక్క

వికీపీడియా నుండి
(కలుపు నుండి దారిమార్పు చెందింది)
రెండు కాంక్రీట్ స్లాబుల మధ్య మొలుస్తున్న కలుపు మొక్క

కలుపు మొక్కలు (ఆంగ్ల భాష Weed) సాధారణంగా పనికిరాని మొక్కలు. ఇవి ఉద్యానవనాలలో, మైదానాలలో లేదా వ్యవసాయ భూములలో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మిగిలిన ఉపయోగకరమైన మొక్కల కంటే త్వరగా పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తాయి.[1]సాధారణంగా కలుపు అనేది అవాంఛనీయ ప్రదేశంలో పెరిగే ఒక మొక్క.ప్రధాన పంటను నష్ట పరిచే ఇతర గడ్డి మొక్కలను కలుపు అంటారు. కలుపు వలన చీడ పీడలు పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.

కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్టకు నష్టం కలిగిస్తాయి. వాటిని కూలీలు చాకచఖ్యంగా సులభంగా గుర్తిస్తారు. పీకేస్తారు. కాని ఒక రకమైన కలుపు మొక్క వుంటుంది. దాని పేరు "ఊదర" .ఇది ఎలా వరి మొక్కల మధ్యలో చేరుతుందో గాని ఇది చాల మోస కారి మొక్క. మనుషుల్లో మోసపూరితమైన వారుంటారనె విషయం అందరికి తెలిసిందే. పశుపక్ష్యాదుల్లో కూడా మోస గాళ్లుంటారు. తమ ఆహారం కొరకు తమ సహ చర జంతువుల నుండి అహారాన్ని దొంగిలిస్తుంటాయి. ఇంకొన్ని జంతువులు పక్షులు తమ ఆహారమైన ఎరను మోస గించి ఏమార్చి గుటుక్కున మింగేస్తాయి. ఇది కూడా చాల మంది ఎరిగినదే. కాని మొక్కల్లో కూడా మోస పూరిత మొక్కలుంటాయని చాల తక్కువ మందికే తెలుసు. ఈ :"ఊదర" మొక్క పూర్తిగా వరి మొక్క లాగే వుంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందరగా పీల్చు కుంటాయి. సకాలంలో వాటి నిపీకేయక పోతె వరి పంట పండదు. అంతా ఊదర పంటే. అవి ఎంత మోసకారివైన ఈ కూలీల కళ్లు గప్పలేవు. చూడ డానికి ఒకే విధంగ వున్న అవి అతి వేగంగా ఏపుగా పెరిగు తాయి. వరి మొక్కలన్ని ఒక విధంగా వున్నా వరి మొక్కలాగే వున్న ఈ ఊదర మొక్కలు కొంత బలంగా ఏపుగా వుంటాయి. ఆ తేడాను బట్టి గుర్తించి వాటిని పీకి అక్కడె ఆ బురదలోనె పూడ్చేస్తారు. ఒకటొ అరో మిగిలిపోతే అవి వెన్ను వచ్చినప్పుడు మాత్రమే గుర్తించ గలము. అప్పుడు రైతులు ఆ వెన్ను లన్ని పక్యానికి రాక ముందే పీకి పారేస్తారు. ఈ కలుపు మొక్క కేవళం వరి పొలాల్లో మాత్రమే పెరుగు తుంది. మరే ఇతర పంటలలోను ఇది పెరగదు. ఇతర పంటల్లో పెరిగితే దీని ప్రత్యేకతను గుర్తించి పీకేస్తారేమో నని దానికి ముందె తెలుసు నేమో? రెండు సార్లు కలుపు తీసిన తర్వాత రెండు నెలలకు వరి పొట్ట కర్ర కొస్తుంది., ఆ తర్వాత ఆ పొట్ట పగిలి వెన్ను బయటకు వచ్చి పాలు పోసుకుంటుంది. ఆ సమయాన "గువ్వలు" దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. వాటిని గిజిగాడు అంటారు. ఇవి ఊర పిచ్చుకల కన్న చిన్నగా వుండి వేల సంఖ్యలో వుంటాయి. పొలాల చుట్టు పక్కల చెట్ల మీద అందమైన గూళ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి. వీటి గూళ్లు చాల అందంగా ఒకటి రెండంతస్తులను కూడా కట్టు కుంటాయి. అవి తమ ఇళ్లల్లో అనగా గూళ్లల్లో దీపాలు కూడా పెట్టు కుంటాయి. ఈత, చెరకు వంటి ఆకులనుండి పొడవాటి ఈనెలను తీసి చెట్టు చిటారు కొమ్మన, ముఖ్యంగా బావుల్లోకి వాలి వున్న చెట్ల కొమ్మలకు అందమైన గూళ్లు అల్లి అందులో నివసిస్తుంటాయి. చీకటి పడేముందు పొలాల్లో మిణుగురు పురుగులు వెలుగులు చిమ్ముతు ఎగురుతుంటాయి. వాటిని పట్టి తీసుకెళ్ళి వాటిని చంపకుండా తమ గూటిలో పైభాగాన వుంచిన బంక మట్టికి గుచ్చి ఆ వెలుగులో అవి కాపురం చేసుకుంటాయి. రెండు మూడు పురుగులు చాలు ఆ గూటిలో వెలుగు నింపడానికి. ఆ మిణుగురులు చని పోతె వెలుగు రాదు. ప్రతి రాత్రి కొత్త మిణుగురులని తెచ్చి దీపాలు పెట్టు కుంటాయి. వేలెడంత లేని ఈ పిట్టకు ఇంత తెలివి ఎలా వచ్చిందో అని ఆచ్యర్య పోవలసినదే. వాటి గూడు నిర్మాణ శైలి కూడా అంత అందంగా వుంటుంది. ఈ పిట్టలు వరికంకులు పొట్ట పగిలే దశలో వందలాదిగా గుంపులు గుంపులుగా వరికంకుల మీవాలి ఆ లేత గింజలను తమ ముక్కులతో వత్తి అందులో వచ్చే తెల్లని పాలను తాగుతాయి. పంట పండాక ఇటువంటి గింజలు అన్నీ తాలు గింజలే. అందు చేత ఆ సమయంలో గువ్వలను తోల డానికి రైతు పొలం దగ్గర కాపలా వుండవలసినదే. కంకుల్లో గింజ ముదిరాక ఈ గువ్వలు రావు.

గింజలు ముదిరాక ఎలుకలు బాధ మరొకటి ఉంది. ఎలుకలు గట్టుల్లో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచు కుంటాయి. ఈ విధంగా కూడా రైతుకు పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది. కాని ఆ రోజుల్లో "ఇర్ల వాళ్ళు" ఎలుకలను పట్టడాని పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితె అందులోకి పొగ పెట్టి త్రవ్వి ఎలుకలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. పొగ పెట్టడాన్ని "ఊదర పెట్టడం" అంటారు. ఒక చిన్న మట్టి కుండకు కింది వైపున చిన్నని రంధ్రం చేస్తారు. ఆ కుండలో పిడకలు కొన్ని వేసి నిప్పుపెట్టి దాని నిండుకు కొంత గడ్డిని, పచ్చి ఆకులను వేసి కుండ మూతిని ఎలుక బొరియకు బోర్లించి చుట్టు మట్టి కప్పి వెనక వున్న రంధ్రంద్వారు ఊదుతారు. అప్పుడు దట్టమైన పొగ ఎలుకల బొరియలంతా వ్వాపిస్తుంది. ఊపిరాడని ఎలుకలు ఎక్కడో ఒక చోట బయటకు వస్తాయి . అప్పుడు వాటిని పట్టుకుంటారు. కొన్ని ఊపిరాడక లోపలే చని పోతాయి. ఆ బొరియలను త్రవ్వి చనిపోయిన ఎలుకలను పట్టు కుంటారు. ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకు తుంది. ఇప్పటికి వీ ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా ఎలుకలు, పిట్టలను పడుతున్నారు. ఈ ఇర్ల వాళ్ళు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవళం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు.

వరికంకులు గింజ కట్టి ముదిరి పైరు ఎర్ర బారితే ఇక ఆ పొలానికి నీరు పెట్టడం మానేస్తాడు రైతు. ఇక పది రోజుల్లో కోతకు సిద్దం అవుతుంది. కూలీలలు పిలిచి, తన కుటుంబ సభ్యులతో కలిసి కొడవళ్లు తీసుకొని వరికోతకు ఉపక్రమిస్తాడు రైతు. పొలం అంతా కోసి వాదులు (కుప్పలు) వేసి నాలుగు రోజులు ఎండనిచ్చి వాటిని మోపులు కట్టి ఐదారు మోపులను పొలంలోనె వదిలి మిగతా అన్నీంటిని కళ్ళం లోనికి చేర్చి కూలీలను పెట్టి తనూ ఒక చెయ్యీ వేసి వాది కొట్టి (నూర్చి) గింజలను వేరు చేస్తారు. పొలంలో వదిలిన ఈ ఐదారు మోపుల వృత్తి పరి వారికి మేర కొరకు వదిలేస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, నీరుగట్టోడు, మొదలగు వారు తలా ఒక మోపు వాలిళ్లకు తీసుకెళ్ళి దాచుకొని, అలా అందరి దగ్గరనుండి మోపులు తెచ్చి ఒక రోజున వాటిని నూర్చి వడ్లను వేరు చేసుకుని ఉపయోగించు కుంటారు. రైతు తన కల్లంలో వున్న ఆ గింజలనుండి తాలు, తప్పలను వేరు చేయడానికి తూర్పార పట్టు తారు. ఆ వడ్లను బస్తాలకు నింపి తన ఎడ్ల బండి మీద ఇల్లు చేరుస్తారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని కొత్త వడ్లను దంచి బియ్యం చేసి ఆ బియ్యాన్ని పొంగలి పెట్టి అనగా ఆ బియ్యంలో బెల్లంవేసి అన్నం వండి నట్టింట దేవునికి తళిగ వేసి దండం పెట్టుకొని ఆ కొత్త బియ్యం అన్నాన్ని తింటారు. కొన్ని ప్రాంత రైతులు అవకాశాన్ని బట్టి అనేక రకాల పంటలను పండిస్తారు. కాని వరి పంట ఇంటి కొచ్చిన వేళ మాత్రమే ఇటువంటి పూజా కార్యక్రమం చేస్తారు. మొక్క పోకుండా పంట ఇల్లు చేరినందున రైతు కళ్లల్లో ఆనంద వెల్లి విరుస్తుంది. గింజలు తీసిని వరిగడ్డిని..... ఇంత వరకు ఆ పొలంలో కూలి చేసిన వారి కుటుంబాలు ఒక రోజున వచ్చి ఆ గడ్డిని కళ్లంలో వేస్తు ఎద్దులతో తొక్కించి విదిలించి కట్టలుగా కట్టి ఆ ప్రక్కనె వామి (కుప్ప) వేస్తారు. కల్లం అడుగున ఆ గడ్డిలో మిగిలిన గింజలు రాలి వుంటాయి. వాటిని బాగు చేసుకొని వాళ్ళు తీసు కెళ్లతారు. పొలం విస్థీర్ణాన్ని బట్టి వారికి ఆ గింజలే ఒకటి రెండు బస్తాలు దొరుకు తాయి. ఆ రోజుల్లో వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసె యంత్రాలు లేవు. వడ్లను ఏతంతో దంచే వారు. ఇది నీరు తోడే ఏతమే కాని దీనికి నీరు తోడే బాన స్థానంలో పెద్ద రోకలి వుంటుంది. కింద పెద్ద రోలు వుంటుంది. అందులో పెద్ద మొత్తంలో వడ్లను పోసి పెద్ద రోకలితో దంచు తారు. కాని సాధారణంగా ప్రతి ఇంట్లోను రోలు -- రోకలి వుంటుంది. రోట్లొ వడ్లను పోసి ఆడవాళ్ళు రోకలితో దంచు తారు. ఈ పని ఆడవారు మాత్రమే చేస్తారు. ఒకే సారి ఇద్దరు ముగ్గురు కూడా కలిసి దంచు తారు. కొంత సేపు దంచాక దానిని చేటలతో చెరిగి బియ్యాన్ని, పొట్టును వేరు చేస్తారు. రోకలిని పెద్ద కర్రమానుతో చేస్తారు. దానికి క్రింద పెద్దది, పైన చిన్నది అయిన పొన్ను వుంటుంది అది ఇనుముతో చేసింది. ఈ రోకలితో అనేక రకాల జొన్నలు, సజ్జలు వంటి గింజలను పప్పులను కూడా దంచు తారు. బియాన్ని పిండి చేయాలంటే కూడా రోలు, రోకలి అవసరమే. ప్రస్తుతం అన్నింటికి యంత్రాలు వచ్చాయి. రోలు, రోకలి మూల పడ్డాయి. ఇది నీరే ప్రదాన అవసరమైన వరి పంట పండించడంలో కొన్ని ప్రాంతాల రైతుల కడగండ్లు వర్ణనాతీతం. వర్షాభారంతో నీరె లేనప్పుడు ఇక వరి ఎక్కడ పండు తుంది. అంచేత ప్రస్తుతం వరి వేసే రైతే కొన్ని ప్రాంతాలలో లేడు. జలాశయాలు, నదులు, కాలువలు వున్న ప్రాంతాలలోనే రైతులు వరి పండించు చున్నారు. అప్పట్లో బియ్యం కొరకు రైతు అంగడి కెళితే అదో అవమానం, నామోషి. ఇప్పుడు అదే రైతు రేషన్ బియ్యం కొరకు అంగలార్చడం, అవి చాలక అంగట్లో బియ్యం కొరకు వెళ్లక తప్పడం లేదు.

నివారణ చర్యలు

[మార్చు]

చేతితో ఏరి వేయుట

[మార్చు]

పంటలో అంతర కృషిగా కలుపును ఏరి కలుపు మొక్కలను నాశనం చేయటం ద్వారా కలుపును నివారించవచ్చు.

దుక్కుల ద్వారా నివారణ

[మార్చు]

నాగలి ద్వారా, లేక గొర్రు ద్వారా దుక్కి దున్ని పంటలో అంతర కృషి చేయట వలన కలుపు నివారించవచ్చు.

మందులతో నివారణ

[మార్చు]

పంటలో కలుపు మందులను కొట్టడం ద్వారా కలుపు మొక్కలను నివారించవచ్చు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Janick, Jules (1979). Horticultural Science (3rd ed.). San Francisco: W.H. Freeman. p. 308. ISBN 0-7167-1031-5.

వెలుపలి లంకెలు

[మార్చు]