చేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.
అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.

చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, చిన్న చిన్న రాళ్ళను, చిన్న చిన్న మట్టి పెళ్ళలను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు. వెదురు బద్దలతో చేసిన చేసిన చేటలు రంధ్రాలు, గరుకు లేకుండా ఉండేందుకు కాగితాలు, మెంతులతో దంచి తయారు చేసిన మిశ్రమాన్ని చేటలపై పూస్తారు, ఈ విధంగా చేయటం వల్ల చేట నున్నగా అందంగా ఉంటుంది, చేట విరగకుండా ఎక్కువ కాలం ఉంటుంది. చేటను హిందువులు ఒక పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. దాదాపు అందరి ఇళ్ళలో ఈ వస్తువు ఉంటుంది. నేడు మార్కెట్ లోకి ప్లాస్టిక్ చేటలు అందుబాటులోకి వచ్చినను వెదురు బద్దలతో తయారు చేసిన చేటకే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారంగా చేట ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పుతో మందంగా వెదురు బద్దలతో అల్లబడి ఉంటుంది. ఒకవైపు ఎక్కువ ఎత్తుగా అంచు ఉండి (పట్టుకునే వైపు) మరొక వైపుకి ఇరువైపుల నుంచి తగ్గుతూ చివరన సాఫీగా ఉంటుంది. చేరగినప్పుడు సాఫీగా ఉన్న వైపుకు తేలికయిన వస్తువులు చేరుతాయి.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చేట&oldid=3979415" నుండి వెలికితీశారు