పొన్ను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్రంగి ఉపయోగించే ఉలి లో ఉపయోగించిన లోహపు రింగులు (పొన్నులు)

పొన్ను : అనగా లోహంతో చేసిన రింగు. ఇది రోకలి, కొడవలి వంటి పనిముట్లలో చివర అమర్చబడి ఉంటుంది. స్తూపాకారపు చెక్క చుట్టూ ఈ లోహపు రింగు అమర్చడం వల్ల అవి అరిగిపోకుండా, వాడుతున్నప్పుడు పాడైపోగుండా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని వస్తువులకు లోహపు పొన్ను కాకుండా ప్లాస్టిక్ వంటివి కూడా వాడుతున్నారు.[1]

వ్యవసాయ రంగంలో

[మార్చు]

దీన్ని కర్రలకు వేస్తారు. రోకలికి క్రింద పెద్దది, పైన చిన్న పొన్ను వుంటుంది. వయసు మీరిన వారు వాడే చేతి కర్రకు కూడ పొన్ను వుంటుండి. పొన్ను వుండే కర్రను పొన్నుగర్ర అంటారు. కొందరు తమ హోదా కొరకు, అందం కొరకు ఇత్తడి పొన్ను, లేదా బంగారు పొన్ను కూడ తమ చేతి కర్రలకు వాడు తుంటారు. పొన్ను వలన ఉపయోగాలు: కర్ర బలంగా వుండి విరిగి పోకుండా, ఆరిగి పోకుండా వుంటుంది. రోకలి లాంటి వాటికి వుండే పొన్ను వలన దానికి బలం చేకూరడమే గాకుండా, దానితో చేసె పని కూడ తొందరగా అవుతుంది. కత్తులకు, కొడవళ్లకు కూడ పొన్ను వుంటుంది. పొన్ను అనగా పిడికి వున్న చిన్న లోహ కవచం.

ఇతర ఉదాహరణలు

[మార్చు]
  • పెన్సిల్ వెనుక భాగంలో రబ్బరు అమర్చడంలో లోహపు లేదా ప్లాస్టిక్ తొడుగు వాడుతారు.
  • వడ్రంగి పనివారు ఉపయోగించే ఉలి చివర లోహపు రింగు ఉంటుంది. దానిపై సుత్తితో కొట్టినా చెక్క పిడికి ఎటువంటి నష్టం జరగదు.
  • చిత్రలేఖనానికి ఉపయోగించే బ్రష్ లలో బ్రెసిల్స్ ను కలిపి ఉంచడానికి లోహపు రింగు ఉంటుంది.
  • దృశా తంతువులు (ఫైబర్ ఆప్టిక్స్) లో తీగలను బంధించడానికి గాజు, ఫైబర్ రింగులను వాడుతారు. ఈ రింగులు వాటిని గట్టిగా కలిపి ఉంచుతాయి.[2]
  • దంతాలను పునరుద్ధరించే రూట్ కెనాల్ వైద్య విధానంలో దంతాలను స్థిరీకరించడానికి లోహపు రింగును వాడుతారు. [3]
  • కొడవలి పిడి వాడినపుదు పాడైపోగుండా లోహపు రింగును అమర్చుతారు.

మూలాలు

[మార్చు]
  1. "Ferrules & Eyelets". Trans-Matic Manufacturing, Inc. Archived from the original on 19 April 2014. Retrieved 18 April 2014.
  2. మూస:Ref patent (download PDF[permanent dead link])
  3. NIH search
"https://te.wikipedia.org/w/index.php?title=పొన్ను&oldid=3879541" నుండి వెలికితీశారు