Jump to content

రోసాఘరా

వికీపీడియా నుండి
మహా ప్రసాదం

రోసాఘరా అనేది భారతదేశంలోని ఒడిశాలోని పూరిలోని జగన్నాథ దేవాలయ సాంప్రదాయ వంటశాల. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది. ఇది ఆలయానికి ఆగ్నేయ దిశలో బయటి వరండాలో ఉంది.[1]

వంటగది వివరాలు

[మార్చు]
  • పొడవు: 150 అడుగులు.
  • వెడల్పు 100 అడుగులు .
  • ఎత్తు దాదాపు 20 అడుగులు .
  • వంటగదిలో 32 గదులు ఉన్నాయి .
  • వంటగదిలో 240 పొయ్యిలు ఉన్నాయి.
  • వంటగదిలో వంట చేయడానికి ప్రతిరోజు కొత్త మట్టి కుండలను ఉపయోగిస్తారు.
  • ప్రతిరోజు దాదాపు 1000 మంది వంటవారు, సహాయకులు వంటగదిలో సేవలు అందిస్తారు.
  • వంటగదిలో మిక్సర్లు, కట్టర్లు, గ్రైండర్లు, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ స్టవ్‌లు వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించరు. ఇక్కడ ఆహారాన్ని తయారుచేసే విధానం 500 సంవత్సరాల క్రితం ఎలా తయారు చేయబడిందో అదే పద్ధతిలో తయారు చేస్తారు. 

ఇక్కడ ఆహారం పూర్తిగా శాఖాహారం, ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, పొట్లకాయలను ఉపయోగించరు. ఇక్కడ లక్షిదేవి వంటలో నిమగ్నమైన వాళ్ళందరిని పర్యవేక్షిస్తుంది. [2]ఈ ఆలయంలో రోజువారీ నైవేద్యాలతో పాటు అదనంగా ఛప్పన్ భోగ్ పేరుతో 56 రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు.[3] ఈ ఆలయంలో వంట చేసేవారిని 'సురా' అని పిలుస్తారు. వీరి కింద 300 మంది జోగానియాలు, 200 మంది తునియాలు ఉంటారు. జోగానియాలు బావుల నుండి నీటిని తీసుకురావడం, మట్టి కుండలను కడగడం, శుభ్రపరచడం, ముడి బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి అవసరమైన పదార్థాలతో మట్టి కుండలను నింపుతారు. తునియాలుముడి పదార్థాలను కడగడం, వాటిని కత్తిరించడం వంటి పనులు చేస్తారు. వంటశాల నుండి నైవేద్య మందిరానికి (భోగ మండపానికి) ఆహారాన్ని తీసుకువెళ్లే వారిని మహాసుర అంటారు. ఈ వంటశాలలో ఆహారాన్ని అపరిశుభ్రంగా వండినట్లయితే, ఆలయ ఆవరణలో ఒక కుక్క రహస్యంగా కనిపిస్తుందని చెపుతారు. దీనిని కుటమ చండి అని పిలుస్తారు. అపుడు వంటగదిలో వండిన అన్ని ఆహార పదార్థాలను పాతిపెట్టి మళ్లీ కొత్త వంటలను తయారు చేస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్న గంగ, జమున అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్నాథునికి భోజనంగా అందించే కోత భోగ లేదా అబధ అత్యంత ముఖ్యమైన ఆహారం. దీనిని జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఆహారాన్ని మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు.

వంట రకాలు

[మార్చు]

జగన్నాథ ఆలయంలోని వంటగదిలో నాలుగు రకాల వంటలు తయారుచేస్తారు. అవి భీమపాక, నలపాక, సౌరిపాక, గౌరిపాక.

  • భీమపాక: బడటియానా, గుడఖురా, పాకాల నదియా రస, పురపిత, బిరిపిత, గుడకంజి
  • నలపాక: సకార, తియనలాపర, ఆడంగా, వివిధ రకాల తీపి పానీయాలు
  • సౌరిపాక: మహురా, దేశీయలుభజ, కదలిభాజ, ఆడపచెడి, ఘియాలాబంగా
  • గౌరీపాక: ముగటియానా, లూటియా, కోసల, మధుర లలిత సాగా

అన్నం రకాలు

[మార్చు]
  • సలియన్న
  • ఖీరాన్నా
  • దధియన్న
  • సీతాళాన్న

మూలాలు

[మార్చు]
  1. "Kitchen of Jagannath Temple, Rosha Ghara". www.shreekhetra.com. Retrieved 2023-06-18.
  2. Service, Pragativadi News (2022-06-24). "Srimandir Rosaghara: A Sneak Peek Into The Jagannath Temple Kitchen". Pragativadi. Retrieved 2023-06-18.
  3. Narayan, M. K. V. (2009). Exploring the Hindu Mind: Cultural Reflections and Symbolisms. Readworthy. ISBN 978-93-5018-101-0.
"https://te.wikipedia.org/w/index.php?title=రోసాఘరా&oldid=4298261" నుండి వెలికితీశారు