రోహన్ అగర్వాల్ విశ్వయాత్రికుడు
విశ్వయాత్రికుడు రోహన్ అగర్వాల్
రోహన్ అగర్వాల్ అనే యువకుడు గత ఆరేళ్లుగా భారతదేశం అంతా పర్యటన చేస్తూనే ఉన్నాడు. అతని సొంతఊరు నాగపూరు. 2019 లో బెనారసు నుంచి పర్యటన మొదలుపెట్టాడు! చిరు వ్యాపారుల కుటుంబం. కాలేజీ చదువుతున్న సమయంలో 18 ఏళ్ళ వయసులో దేశాటన చేయాలనే బలమయిన కాంక్షతో తల్లిదండ్రులను ఒప్పించి, వారి అంగీకారంతోనే కాలేజీ చదువు మధ్యలోనే ముగించి యాత్ర ఆరంభించాడు. కరోనా ముమ్మరంగా ఉన్న సమయంలో అగర్వాల్ నెల్లూరు వచ్చాడు. ధర్మా విజయభాస్కరరెడ్డి అతనికి ఆతిధ్యం ఇచ్చారు. వారితోపాటు ఈ రచయిత యింటికి వచ్చాడు. అప్పటికే అతను దక్షిణభారత దేశం అంతా తిరిగాడు. Backa pack traveller. కులమత జాతి భేదాలు పాటించడు. ఎవరు పెట్టినా అన్నం తింటాడు. నిరుపేదలు తమ పడకమీద పడుకోమని తాము నేలమీద పడుకొన్న సంఘటనలు గురించి చెబుతూ ఎక్కడకు వెళ్ళినా తనను ఎంతో గౌరవంగా చూచారంటాడు.
అతని పర్యటన వివరాలు ముఖ పుస్తకం ద్వారా తెలుస్తూనే ఉంటాయి. దాదాపు ఇండియా అంతా తిరిగాడు. ఏదో గమ్యం అంటూ పెట్టుకొడు, ఎవరు వాహనంలో ఎక్కించుకొని ఎక్కడ విడిచిపెడితే అక్కడ దిగి కాలినడకన వెళతాడు. ఏడాది క్రితం బంగ్లాదేశ్ ఆరునెలల కాలం తిరిగాడు. ఈ నడుమ నేపాల్ అంతా తిరిగాడు. హిందీ, ఇంగ్షీషు బాగా మాటలాడుతాడు, రాస్తాడు. తను చూచిన ప్రదేశాలు, కలిసిన మనుషులను గురించి రాస్తాడు. ఇంటికి ఫోన్ చేసి సమాచారాలు తెలుసుకొంటాడు.సైబీరియా వరకూ తిరగాలని ఉందని అన్నాడు. ఎవరయినా లిఫ్ట్ ఇస్తే వెళతాడు. లేకపోతే కాలినడక. మనం ఏదయినా ఇస్తే తీసుకొంటాడు కానీ యాచించడు. ఇప్పుడు యాత్ర ఫోటోలు, వీడియోలు కూడా ఫేస్ బుక్ లో పెడుతున్నాడు. రోహన్ అగర్వాల్(Rohan Agarwal) నెల్లూరు వచ్చినపుడు కరోనా ముమ్మరంగా ఉన్న రోజులు. మధ్యప్రదేశ్ అడవిమార్గంలో కాలినడకన వెళుతూ ఉంటే దొంగలు అటకాయించి అతనివద్ద ఉన్న డబ్బు తీసేసుకున్నారట. వాళ్ళతో మాట్లాడిన తర్వాత దొంగలు తనడబ్బు వెనక్కి ఇచ్చి, తిరిగి కొంత డబ్బు బహూకరించి పంపారట. గూగుల్ లో అతనిపేరుతో అన్వేషిస్తే రోహన్ అగర్వాల్ పర్యటన వివరాలు తెలుసుకోవచ్చు.
మూలాలు
[మార్చు]- 1.రోహన్ అగర్వాల్ తో నేను చేసిన ఇంటర్వ్యూ .
- 2.At 18, Nagpur's Rohan Agarwal Is Hitchhiking His Way to Siberia, YouTube · The Better India
- Young traveller from Nagpur on a mission to walk to Siberia, Rohan has already explored 25 states
Photo of Reporter Sent an email, August 22, 2022, Meghalaya Monitor.