Jump to content

రోహిత్ పూజారి

వికీపీడియా నుండి
రోహిత్ పూజారి[1]
ముందు ప్రసన్న ఆచార్య
నియోజకవర్గం రైరాఖోల్

వ్యక్తిగత వివరాలు

జననం 29 డిసెంబర్ 1973
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు శ్రీ రామేంద్ర పూజారి (తండ్రి)
జీవిత భాగస్వామి వైశాలి పూజారి
సంతానం రిత్విక్, రిషిక
నివాసం బర్మా హౌస్, భూతాపరా చౌక్, సంబల్‌పూర్ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు
పురస్కారాలు టైమ్స్ పవర్ మ్యాన్ అఫ్ ది ఇయర్ 2019[2]

రోహిత్ పూజారి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రైరాఖోల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

రోహిత్ పూజారి బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రైరాఖోల్ నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 24 మే 2014 నుండి 29 మే 2019 వరకు ఒడిశా ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా పని చేశాడు. రోహిత్ పూజారి 2019లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 23 సెప్టెంబర్ 2019 నుండి 04 జూన్ 2022 వరకు ఒడిశా ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా పని చేసి, 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఉన్నత విద్య శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "MLA Rohit Pujari Profile | Rairakhol Constituency". odishahelpline.com.[permanent dead link]
  2. "Odisha Legislator Rohit Pujari Awarded Times Power Man Of The Year 2019". July 27, 2019. Archived from the original on 2023-01-29. Retrieved 2022-07-09.
  3. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  4. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.