Jump to content

రౌడీ రంగమ్మ

వికీపీడియా నుండి
రౌడీ రంగమ్మ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం చంద్రమోహన్,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
భాష తెలుగు

రౌడీ రంగమ్మ 1978 ఏప్రిల్ 27న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకం కింద ఎస్. రవికుమార్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. చంద్రమోహన్, విజయనిర్మలలు ప్రధాన తారాగణంగా నటించిన ఈసినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • విజయనిర్మల,
  • రంగనాథ్,
  • నాగభూషణం,
  • గిరిబాబు,
  • మోదుకూరి సత్యం,
  • రామ్ మోహన్ (నటుడు),
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • జయంతి,
  • పద్మ ప్రియ (నటి),
  • పుష్ప కుమారి,
  • రాధా కుమారి,
  • హలం,
  • బేబీ వరలక్ష్మి,
  • బేబీ స్వప్న,
  • సావిత్రి గణేషన్,
  • అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయనిర్మల
  • నిర్మాత: ఎస్. రవికుమార్;
  • సినిమాటోగ్రాఫర్: పుష్పాల గోపీకృష్ణ;
  • స్వరకర్త: రమేష్ నాయుడు;
  • సాహిత్యం: దాసం గోపాలకృష్ణ, జలధి

పోలీసు అధికారి ఈశ్వరరావు స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. స్మగ్లర్లు ఈశ్వరరావు ఇంటికి నిప్పు అంటిస్తారు. ఈశ్వరరావు భార్య కూడా మంటలలో చిక్కుకుంటుంది. తల్లిని కాపాడే ప్రయత్నంలో పెద్దమ్మాయి లక్ష్మీ గుడ్డిదవుతుంది. చిన్నమ్మాయి గమ్మమ్మ అక్కను తీసుకుని దుర్మార్గులకు దూరంగా వెళ్ళి ఒక మురికి వాడలో జీవిస్తూ ఉంటుంది. మురికి వాడలలోని వేష భాషలతో పెరిగి పెద్దదయిన రంగమ్మ, తన అక్కను అక్క కొడుకును పోషితూ ఉంటుంది. రౌడీలను చిత్తు చేస్తూ రౌడీ రంగమ్మ అనే పేరు తెచ్చుకుంటుంది. ఏనాటికయినా తన అక్కకు చూపు తెప్పించి తన తల్లి దండ్రుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడిని కనుగొని వాడి మీద పగ తీర్చుకుంటానని రంగమ్మ శపథం చేస్తుంది. అదే పట్టణంలో ఉంటున్న చంద్స్రం, తన చెల్లులు లలిత వివాహం చేయడాం కోసం తాను ముందుగా పెళ్ళి చేసుకోవలసి రావడంతో తన బాబాయి భూషణం ప్లాను ప్రకారం రంగమ్మను కాంట్రాక్టు వివాహం చేసుకుంటాడు. అక్కకు చూపు తెప్పించడానికి డబ్బు అవసరమయిన రంగమ్మ చంద్రంతో తాత్కాలిక వివాహానికి అంగీకరించి చంద్రం భార్యగా అతడి భవనంలో ప్రవేశిస్తుంది. కృష్ణ సమర్పించిన విజయ కృష్ణా మూవీస్ ని రౌడీ రంగమ్మ చిత్ర కథ ఇక్కడి నుండి మలుపు తిరుగుతుంది.

పాటల జాబితా

[మార్చు]

1.ఆదికాలం దేవుళ్లయ్యో, రచన: జాలాది రాజారావు, గానం.పులపాక సుశీల

2.చెట్టు కొట్టగలవా ఓ నరహరి, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.పి.సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.నా కైపెక్కిన కన్నుల్లో ఎన్నెన్నో కోరికలు, రచన: జాలాది రాజారావు, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

4.సెక్కబల్ సెక్కరోలు బండోలు, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.పి.సుశీల .

మూలాలు

[మార్చు]
  1. "Rowdi Rangamma (1978)". Indiancine.ma. Retrieved 2023-07-28.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.