లక్ష్మణ్ భట్ తైలాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్
జననం1931
భారతదేశం
మరణం2024 ఫిబ్రవరి 11
జాతీయత భారతీయురాలు
వృత్తిద్రుపద్ సంగీత కళాకారుడు
పిల్లలుకుమారుడు రవిశంకర్, కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తి
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం 2024

లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ భారతదేశానికి చెందిన ధృపద్ కళాకారుడు. ఆయన 2024లో కేంద్ర ప్రభుత్వ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డుకు రాజస్థాన్ రాష్ట్రం తరపున ఎంపికయ్యాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ సంగీతంపై ఉన్న ఆసక్తితో సంగీత విద్యను అభ్యశించి, వివిధ కళా ప్రక్రియలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన బనస్థలి విద్యాపీఠ్‌లో 1950 నుండి 1992 వరకు, 1991 నుండి 1994 వరకు జైపూర్‌లోని రాజస్థాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీత ఉపన్యాసకుడిగా పని చేశాడు.

ఆయన 1985లో జైపూర్‌లోని 'రసమంజరి సంగీతోపాసన కేంద్రం'  2001లో జైపూర్‌లో 'అంతర్జాతీయ తృష్టుపద్ ట్రస్ట్' ని స్థాపించాడు.

పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ మరణానంతరం.. గౌ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2024 ఏప్రిల్ 22న పద్మశ్రీ పురస్కారం అందుకున్న అయన కుమారుడు

మరణం

[మార్చు]

లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ 2024 ఫిబ్రవరి 11న న్యుమోనియాతో పాటు పలు వ్యాధులతో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న దుర్లబ్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించాడు.[2][3] ఆయనకు కొడుకు రవిశంకర్, కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తి ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi Education. "Padma Awards Winners 2024 : ఈ సారి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ అవార్డు విజేత‌లు వీరే.. తెలుగు రాష్ట్రాల నుంచి." Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  2. TV9 Telugu (11 February 2024). "ప్రముఖ గాయకుడు కన్నుమూత.. పద్మశ్రీ అందుకోకుండానే అనంత లోకాలకు." Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NTV Telugu (11 February 2024). "పద్మశ్రీ అందుకోకుండానే ప్రముఖ సింగర్ మృతి." Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  4. LatestLY (10 February 2024). "Pandit Laxman Bhatt Tailang, Padma Shri 2024 Awardee, Dies at 93" (in ఇంగ్లీష్). Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.