లగడపాటి బాబూరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లగడపాటి బాబూరావు ప్రముఖ సినిమా పాత్రికేయులు, సుప్రసిద్ద పీఆర్ఓ.[1] ఈనాడు, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలకు, శివరంజని, సాక్షి సినిమా పేజీలకు ఆయన పాత్రికేయులుగా పనిచేశారు. 2008 నుండి ఆయన సాక్షి పత్రికలో కొనసాగుతూ వస్తున్నారు. మోహన్ బాబు, సౌందర్య, స్రవంతి రవికిషోర్, రాశి, లయ, మమతామోహన్ దాస్, హన్సిక, రామ్ వంటి వారికి ఆయన పీఆర్ఓగా వ్యవహరించారు. ఆయన వందకు పైగా సినిమాలకు, పలువురు హీరోయిన్లకు పీఆర్వోగా పనిచేశారు.

పాత్రికేయునిగా[మార్చు]

ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, శివరంజని, సాక్షి వంటి ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ‘శివరంజని’ నుంచి బయటకు వచ్చాక... ‘చిత్రం’ అనే సినీ వారపత్రికను స్థాపించారు. అనేక హంగులతో వెలువడిన ఈ పత్రిక... తెలుగు సినీ జర్నలిజంలో సంచలనంగా నిలిచింది. బాబురావు ఆధ్వర్యంలోని ఆ పత్రిక వినూత్నమైన విధానంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది.[2],

మరణం[మార్చు]

ఆయన గత కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతూ 21/08/2013 మధ్యాహ్నం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[3]

మూలాలు[మార్చు]

  1. "ఆర్వో బాబూరావు ఇక లేరు". మూలం నుండి 2016-03-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-01-09. Cite web requires |website= (help)
  2. సీనియర్ సినీ పాత్రికేయులు ఎల్.బాబూరావు కన్నుమూత
  3. "సినీ జర్నలిస్టు బాబురావు కన్నుమూత". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-01-09. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]