Jump to content

లచ్చు మహరాజ్ (సంగీతకారుడు)

వికీపీడియా నుండి

లక్ష్మీనారాయణ సింగ్  ( 1944 అక్టోబరు 16 – 2016 జూలై 28), లచ్చు మహరాజ్ గా సుపరిచితుడు. అతను బెనారస్ ఘరానా సాంప్రదాయ సంగీతానికి చెందిన తబలా కళాకారుడు.[1]

అతను 1944 అక్టోబరు 16న వాసుదేవ్ నారాయణ సింగ్ కు జన్మించాడు. [2] అతని సోదరి నిర్మల సినీనటుడు గోవిందకు తల్లి.[3] అతను ఫ్రెంచ్ మహిళ తీనాను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె నారాయణి కలదు. 

అతను ప్రపంచవ్యాప్తంగా తబలా ప్రదర్శనలనిచ్చాడు. కొన్ని సినిమాలకు కూడా సంగీతాన్నందించాడు. [4] అతనికి భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ వచ్చింది కానీ ఆ పురస్కారాన్ని తిరస్కరించాడు. తన సంగీతాన్ని ఆదరించే అభిమానులే నిజమైన పురస్కారంగా అతను భావించాడు. [5]

మరణం

[మార్చు]

అతను 2016 జూలై నెలలో తన 71వ యేట మరణించాడు.  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించాడు.[6]

గౌరవం

[మార్చు]

అతని 74వ జన్మదినం సందర్భంగా గూగుల్ డూదుల్ తో గౌరవించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "World Famous Tabla Player Lachhu Maharaj Passes Away". Nai Dunia - Jagran. Retrieved 2016-07-29.
  2. "Tabla beats stop (थम गई तबले की थाप)". epaper.jagran.com. Archived from the original on 2016-08-18. Retrieved 2016-07-29.
  3. "Famous Tabla exponent Lachhu Maharaj no more (बनारस घराने के मशहूर तबला वादक लच्छू महाराज का निधन, सीएम ने जताया शोक)". ABP Live. 2016-07-28. Archived from the original on 1 August 2016. Retrieved 2017-12-25.
  4. "Tabla maestro Pandit Lacchu Maharaj dies in Varanasi". Indian Express. 2016-07-28. Retrieved 2016-07-29.
  5. "बचपन में ही गोविंदा ने लच्छू महाराज को बना लिया था गुरु..." Daily Bhaskar. Retrieved 2016-07-29.
  6. "Tabla maestro Pandit Lacchu Maharaj dies in Varanasi". Times of India. Archived from the original on 20 నవంబరు 2016. Retrieved 2017-12-26.
  7. "Google pays homage to noted tabla maestro Lachhu Maharaj on 74th birthday". www.financialexpress.com. Retrieved 16 October 2018.