Jump to content

లాస్ట్ హొరైజన్ (1937 సినిమా)

వికీపీడియా నుండి
లాస్ట్ హొరైజన్
లాస్ట్ హొరైజన్ సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రాంక్ కాప్రా
స్క్రీన్ ప్లేరాబర్ట్ రిస్కిన్
నిర్మాతఫ్రాంక్ కాప్రా
తారాగణంరోనాల్డ్ కోల్మన్, జేన్ వ్యాట్, సామ్ జాఫే, జాన్ హోవార్డ్, హెచ్.బి. వార్నర్
ఛాయాగ్రహణంజోసెఫ్ వాకర్, ఎల్మెర్ డయ్యర్
కూర్పుజీన్ హవ్లిక్, జీన్ మిల్ఫోర్డ్
సంగీతండిమిట్రి టియోంకిన్
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్
విడుదల తేదీ
మార్చి 2, 1937 (1937-03-02)
సినిమా నిడివి
132 నిముషాలు
210 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$2 మిలియన్[1]

లాస్ట్ హొరైజన్ 1937, మార్చి 2న విడుదలైన అమెరికా చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, జేమ్స్ హిల్టన్ 1933లో రాసిన లాస్ట్ హొరైజన్ అనే నవల ఆధారంగా రూపొందించబడింది.

1931 మే నెలలో బాస్కల్ అనే ప్రదేశం (ఇరాన్) నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నలుగురు పౌరులని పెషావర్ చేర్చడానికి పూనుకుంటుంది. కథానాయకుడు హ్యూ కాన్వే (బ్రిటిష్ దౌత్యాధికారి), అతని అసిస్టెంటు మాలిన్సన్, క్రైస్తవ మిషనరీ మిస్ బ్రింక్లో, ఇంకా బెర్నార్డ్ అనే సాధారణ పౌరుడు- వీరు నలుగురూ చండీపూర్ మహారాజుగారి ప్రత్యేక విమానంలో పెషావర్ బయల్దేరతారు. అయితే ఆ విమానం దారితప్పి హిమాలయాల్లో కుప్పకూలిపోతుంది. అక్కణ్ణించి వారు షాంగ్రి-లా అనే ఒక బౌధ్ధ మఠం చేరుకుంటారు. అక్కడికి వారిని చేర్చడానికి చాంగ్ అనే సన్యాసి తోడ్పడతాడు. అద్భుతమైన అలౌకికమైన సౌందర్యంతో ఉండే ఆ ప్రదేశం పేరేమిటో, ఆ పర్వత శ్రేణువులేమిటో, అసలు తామే భూభాగంలో వున్నామో కూడా ప్రయాణికులకి అర్థం కాదు. ఎక్కడో టిబెట్ దగ్గర వున్నామని అంచనా వేసుకుంటారు.

ఆ మఠం ప్రత్యేకత ఏమిటి? అక్కడ వాళ్ళేం చూసారు? అక్కణ్ణించి వాళ్ళు బయటపడ్డారా లేదా? అసలు బయటపడాలనుకున్నారా లేదా? ఆ ఆశ్రమంలో వాళ్ళకి కొంతమంది (చాలా కొంతమంది!) సన్యాసులు కనిపిస్తారు. కొండలమధ్యలో మామూలు నాగరికతకు బహు దూరంగా వుండే ఆ మఠంలో ఆధునిక జీవనానికి కావల్సిన సౌకర్యాలన్నీ వుంటాయి. అవి అక్కడికెవరు చేరవేసారు? యాత్రికులకి ఆ సంగతి అర్థం కాదు. ఇంకా ఎన్నెన్నో సందేహలు. క్రమం తప్పకుండా మొజార్ట్ సంగీతాన్ని మౌనంగా పియానో మీద వినిపించే లో-సేన్ ఎవరు? ఆ మఠంలో ఎందుకుంది? బెర్నార్డ్ ఆ మఠాన్ని వదిలి బయటి ప్రపంచానికెందుకు రానంటున్నాడు? అసలు ఆ మఠానికి డబ్బెకణ్ణించి వస్తుంది? మాలిన్సన్ ఈ ప్రశ్నల్లన్నిటితో ఉక్కిరిబిక్కిరవుతూ వుంటే కాన్వే మాత్రం నిరాసక్తంగా అన్నిటినీ ఆకళింపు చేసుకుంటూ వుంటాడు. ఆ మఠానికీ, అక్కడి నియమాలకీ ప్రయాణికుల స్పందనే చిత్ర కథాశం.

నటవర్గం

[మార్చు]
  • రోనాల్డ్ కోల్మన్
  • జేన్ వ్యాట్
  • హెచ్.బి. వార్నర్
  • సామ్ జాఫే
  • జాన్ హోవార్డ్
  • ఎడ్వర్డ్ ఎవెరెట్ హోర్టన్
  • థామస్ మిట్చెల్
  • మార్గో
  • ఇసాబెల్ జవెల్
  • హుగ్ బక్లర్
  • విల్లీ ఫంగ్
  • రిచర్డ్ లూ
  • లియోనార్డ్ ముడి
  • డేవిడ్ టోరెన్స్
  • విక్టర్ వాంగ్
  • సోనీ బప్ప్
  • నోబెల్ జాన్సన్
  • మార్గరెట్ మక్వేడ్

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత, దర్శకత్వం: ఫ్రాంక్ కాప్రా
  • స్క్రీన్ ప్లే: రాబర్ట్ రిస్కిన్
  • ఆధారం: జేమ్స్ హిల్టన్ 1933లో రాసిన లాస్ట్ హొరైజన్ అనే నవల
  • సంగీతం: డిమిట్రి టియోంకిన్
  • ఛాయాగ్రహణం: జోసెఫ్ వాకర్, ఎల్మెర్ డయ్యర్
  • కూర్పు: జీన్ హవ్లిక్, జీన్ మిల్ఫోర్డ్
  • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్

చిత్రవిశేషాలు

[మార్చు]
  1. ఈ చిత్రాన్ని తీయడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది.[2]
  2. ఈ చిత్రంకోసం 150మందితో రెండు నెలలపాటు శ్రమించి పెద్ద సెట్ ను ఏర్పాటుచేశారు.[2]

అవార్డులు

[మార్చు]
  1. ఈ చిత్రం ఉత్తమ ఎడిటింగ్ (జీన్ హవ్లిక్, జీన్ మిల్ఫోర్డ్),ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ (స్టీఫెన్ గూస్సన్) విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది.[3] అంతేకాకుండా ఉత్తమచిత్రం, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ దర్శకుడు విభాగాల్లో నామినేట్ చేయబడింది.[4]

గుర్తింపులు

[మార్చు]
  1. 2016లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా సిటీ లైట్స్ చిత్రాన్ని ఎంపిక చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Rudy Behlmer, Behind the Scenes, Samuel French, 1990 p 37 ISBN 978-0573606007
  2. 2.0 2.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 46.
  3. "The 10th Academy Awards (1938) Nominees and Winners." oscars.org. Retrieved: August 9, 2011.
  4. "Lost Horizon (1937)." TCM. Retrieved: February 23, 2011.

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]