Jump to content

లా స్ట్రాడా,

వికీపీడియా నుండి

ఇటలీ దేశ సినిమా దర్శకులు ఫెడరికో ఫెలినీ 1954 లో తీసిన లా స్ట్రాడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలయిన neo realism లేక నవ్య వాస్తవిక వాద సినిమాలకు శ్రీకారం చుట్టింది. ఫెలినీ ఆ తర్వాత తీసిన సినిమాలు ఈ ధోరణిలోనే మరింత స్పస్టంగా ఈ శిల్పాన్ని ఉపయోగించుకున్నాడు. వీధుల్లో బలప్రదర్శన, సర్కస్ ప్రదర్శనలు చేసి జీవించే పశు ప్రవృత్తిగల అతను తనకు సహాయకురాలుగా ఉపయోగించుకోడానికి ఇంకా కౌమారంలోకి అడుగుపెట్టని ఒక అనాథ అమాయిక బాలికను, తన కూతురిని కూటికి గుడ్డకు కరువు అయిన ఒక దరిద్రురాలు పోషించలేక అతనికి అమ్ముతుంది. అతడు ప్రదర్శనలిస్తూ ఆ బాలికను వాడుకొంటూ, లయింగికంగా బాధిస్తూ వెంట తిప్పుకొంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అన్నీ సహిస్తూ అతనివెంట ప్రదర్శనలిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ వెర్రిబాగులపిల్ల ఆ పాషాణ హృదయుణ్ణి మనిషిగా మార్చడం, అతనిలోని మనిషిని మేలుకొల్పడమే సినిమా, హృదయం లేని అతడు మనిషిగా మారుతాడు ఆమె సహవాసంతో. ఈ మార్పును అతి సహజంగా దర్శకుడు చూపుతాడు. ఆ అమ్మాయి స్మృతి అతని మనసులో మెదలాడుతూ ఉంటుంది, అయితే దర్శకుడు దీన్ని వాచ్యంగా చెప్పడు. అతడు వేదనతో సముద్రతీరంలో బోర్లా పడుకొని ఉంటాడు, నేపథ్య సంగీతం మారుగా ఆ బాలిక తరచూ తన వాయిద్యం మీద పలికించే పాట మెల్లగా వినపడుతూ ఉంటుంది. ఆ సంగీతం ఆమె స్మృతులను మెల్లమెల్లగా ప్రేక్షకుల హృదయాలలో ఆవిష్కరించ బడతాయి. అధివాస్తవికావాదం, క్యూబిజం, డాడాయిసం వంటి అనేక ధోరణుల మాదిరే రీయలిసం కూడ ప్రపంచాన్ని ఊపేసింది.

మూలాలు: La Strada filam, 1954. Notes provided to Students in Film And T.V.Institute, Pune during Film Appreciation Course, 1980.