లింగోద్భవ వేళ
మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లు స్కాంద తదితర పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి.[1] చతుర్దశి పగటివేళ ముగిసినప్పటికీ ఆ నాటి అర్ధరాత్రి లింగోద్భవ వేళగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సంప్రదాయం. బ్రహ్మ విష్ణువులకు తన ఆధిక్యాన్ని తెలియజేయడం కోసం శివుడు జ్యోతి రూపంలో ఒక స్తంభంగా అంతు తెలియనంతగా, ఆద్యంతాలు కనిపించ నంతగా పైకీ, క్రిందికీ వ్యాపించాడనీ, బ్రహ్మ విష్ణువులు లింగం ఎక్కడ మొదలో ఎక్కడ చివరో తెలుసుకొన లేనప్పుడు శివుడు అగ్ని స్తంభం మధ్యలో వారికి దర్శనం ఇచ్చాడనీ పురాణ గాథ.[2]
శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Telugu, 10TV; chvmurthy (2020-02-21). "లింగోద్భవ కాలం అంటే ఏమిటి ?". 10TV Telugu (in Telugu). Retrieved 2024-06-17.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Nagaraju, Pandari (2024-03-07). "మహాశివరాత్రి.. లింగోద్భవం." Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-17.
- ↑ https://www.gotelugu.com. "లింగోద్భవం . | Gotelugu.com". https://www.gotelugu.com. Retrieved 2024-06-17.
{{cite web}}
: External link in
(help)|last=
and|website=