లింగ సమానత్వ సూచీ - 2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) - 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్ తో 127 వ స్థానంలో నిలిచింది[1]. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది[2]. విద్యలో అన్ని స్థాయిల్లో ప్రవేశాలకు సంబంధించి భారతదేశం లింక సమానత్వం సాధించిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలియజేసింది. లింగ సమానత్వ సూచి స్కోరు 2023 సంవత్సరంలో 68.1 శాతం నుండి 68.4 శాతానికి పెరిగింది. 0.3% వృద్ధి విద్య వల్లనే సాధ్యమైందని పేర్కొంది. అన్ని రంగాల్లో లింగబేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజు వేసినా, శ్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలు ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానాన్ని నిలుపుకుంది[3].

మూలాలు

[మార్చు]
  1. "Bridging the gender gap: WEF ranks India 127th in Global Gender Gap Report 2023". Financialexpress (in ఇంగ్లీష్). 2023-07-03. Retrieved 2023-09-18.
  2. Amarnath (2023-06-21). "లింగ సమానత్వంలో 127వ స్థానంలో భారత్". www.tv5news.in. Retrieved 2023-09-18.
  3. Telugu, ntv (2023-06-22). "Global Gender: లింగ సమానత్వంలో భారత్‌ స్థానం మెరుగుపడింది". NTV Telugu. Retrieved 2023-09-18.