లినక్సు ఏకీకరణ
స్వరూపం
లినక్సు అనేది కెర్నలు పేరు, లేదా ఇంకా చెప్పాలంటే ఒక ఆపరేటింగు సిస్టము పేరు, కానీ లినక్సులో చాలా రకాలు ఉన్నాయి, వీటిని పంపిణీ సంస్థలు నియంత్రిస్తుంటాయి. కొంతమంది ఇన్ని పంపిణీ వ్యవస్థలు అనవసరము అని వాదిస్తుంటారు, అదే సమయంలో మరి కొందరు మాత్రం ఇవి లినక్సు పెరుగుదలకు చాలా అవసరము అని వాదిస్తుంటారు. ఈ దిగువ ఈ రెండు వాదనలు పరిశీలించడం జరిగింది.
లినక్సు ఏకీకరణ వాదనలు
[మార్చు]- మాక్ లేదా విండోసు లా కాకుండా లినక్సు ఎన్నో రకాలుగా ఉన్నది, ఇది వినియోగదారులకు చాలా అయోమయంగా, తికమకగా ఉంది.
- అన్ని పంపిణీలు ఒకే పనిని మరలా మరలా చేస్తున్నాయి. ఇది చక్రాన్ని మరలా కనుగొనడం లాంటిది!
- ఇన్ని పంపిణీసంస్థలు ఉండటం వల్ల లినక్సు సమాజం విభజనకు గురియవుతుంది.
లినక్సు ఏకీకరణ వ్యతిరేఖ వాదనలు
[మార్చు]- పంపిణీ వ్యవస్థలు ఉండుటం వల్ల వినియోగదారుల ప్రాధాన్యతలకు లాభం కలుగుతుంది
- పంపిణీ వ్యవస్థలులో కెర్నలు నిర్మాణపు సంఖ్యలు వివిధ రకాలు వాడుకలో ఉన్నాయి
- పంపిణీ వ్యవస్థలు చిన్న చిన్న లినక్సు సమాజాలు ఏర్పాటు చేసి తద్వారా వ్యక్తులు చాలా చక్కగా తమను తాము గుర్తించుకుంటారు