లినక్స్ కెర్నల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


లినక్స్ కెర్నల్
Tux
Linux 3.0.0 boot.png
లినక్స్ కెర్నల్ 3.0.0 ప్రారంభం
వెబ్‌సైట్ www.kernel.org
అభివృద్ధిచేసినవారు లినస్ టోర్వాల్డ్స్ మరియు వేలాది ఔత్సాహికులు
OS కుటుంబం యునిక్స్-వంటిది
మెదటి విడుదల 1991
భాషల లభ్యత ఆంగ్లం
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ రూపాంతరం 2 (మాత్రమే)
The Linux kernel is ubiquitously found on various hardware and is supported by an abundance of both, free and open-source and also proprietary software

ప్రతి ఆపరేటింగ్ సిస్టం(నిర్వాహక వ్యవస్థ)ను మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి కెర్నెల్, షెల్ మరియు అనువర్తనాలుగా చెప్పవచ్చు. వీటిలో అతి ముఖ్యమైనది కెర్నెల్. ఇది సరాసరి హార్డువేరు పరికరాలతో సంభాషిస్తుంది. ఇది షెల్ మరియు ఇతర అప్లికేషన్ల ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రాసెసర్, మెమొరీ, హార్డ్ డిస్క్ మరియు ఇతర హార్డువేరు పరికరాలతో పని చేయిస్తుంది. మరియు వచ్చిన ఫలితాలను షెల్ మరియు ఇతర సాఫ్టువేరు గమనాలకు(processes) అందిస్తుంది.


మొదట కంప్యూటరు ప్రారంభించినపుడు బూట్ గమనం కెర్నెలును పర్యవేక్షక పాత్రలో మెమొరీ లోకి నింపుతుంది. తర్వాత కెర్నెలు తనంత తానే నడుస్తూ కంప్యూటరుకు సంబంధించిన ఇతర సర్వీసులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అది తెర వెనుక పాత్రకు పరిమితమౌతుంది. ఇతర అనువర్తనాలు తట్టి అడిగినపుడు మాత్రమే అది తగిన కోరికలు తీరుస్తుంది.
కెర్నెలు ముఖ్యంగా మూడు భూమికలు నిర్వహిస్తుంది. అవి, గమనాల నిర్వహణ(Process Management), గుర్తు నిర్వహణ(Memory Management) మరియు పరికరాల నిర్వహణ(Device Management). అధిక సమాచారం కోశం ఈ మార్గము లో చూడండి.