లియోన్ ట్రాట్స్కీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Leon Trotsky
లియోన్ ట్రాట్స్కీ

Trotsky in 1921


Premier Vladimir Lenin
Alexei Rykov

Premier Vladimir Lenin

President of the Petrograd Soviet

Full member of the 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th Politburo

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ RSDLP
SDPS
Mezhraiontsy
CPSU
Fourth International
జీవిత భాగస్వామి Aleksandra Sokolovskaya
Natalia Sedova
సంతానం Zinaida Volkova
Nina Nevelson
Lev Sedov
Sergei Sedov
సంతకం లియోన్ ట్రాట్స్కీ's signature

Leon Trotsky[lower-alpha 1] (/ˈtrɒtski//ˈtrɒtski/;[1] Russian: Лев Дави́дович Тро́цкий; pronounced [ˈlʲɛf ˈtrotskʲɪj]; అసలు పేరు Lev Davidovich Bronstein;[lower-alpha 2] 7 November7 November [O.S. 26 October] 1879O.S.7 November [O.S. 26 October] 1879 – 21 ఆగస్టు 1940) రష్యా దేశానికి చెందిన ప్రముఖ మార్క్సిస్టు విప్లవకారుడు, సిద్ధాంత కర్త. ప్రసిద్ధి చెందిన అక్టోబరు విప్లవం 1917లో ప్రముఖ విప్లవ నాయకుడు లెనిన్ తో కలిసి ఆ విప్లవాన్ని నడిపించాడు. "రెడ్ ఆర్మీ" అనే దళాన్ని ఏర్పాటు  చేసాడు.

ట్రాట్స్కీ విప్లవానికి ముందు మెన్షివిక్ ఇంటర్నేషనల్ కు వ్యతిరేకమైన సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీకి మద్ధతునిచ్చాడు. ఆ తరువాత అక్టోబరు విప్లవానికి కొద్ది కాలం ముందు బోల్షివిక్ పార్టీలో చేరాడు. కొద్ది కాలానికే కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు. అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు లెనిన్, జినోవ్యెవ్, కమానెవ్, స్టాలిన్, సోకోల్నికోవ్, బుబ్నోవ్, లతో కలిసి  పోలిట్ బ్యూరో సభ్యుడిగా 1917లో బోల్షివిక్ ఉద్యమాన్ని నడిపాడు. విప్లవానంతరం రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్టు రిపబ్లిక్ (RSFSR), సోవియట్ యూనియన్  దేశానికి మొదటి విదేశాంగ నాయకుడిగా పనిచేసాడు. ఆ తరువాత రెడ్ ఆర్మీ దళానికి నాయకుడిగా పనిచేశాడు. విప్లవానంతరం రష్యాలో ఏర్పడిన ప్రచ్ఛన్న యుద్ధంలో (1918–1923) బోల్షివిక్ పార్టీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

లెనిన్ మరణానంతరం సోవియట్ అధినేతగా స్టాలిన్, ట్రాట్స్కీల మధ్య నెలకొన్న వైరుద్ధ్యం తరువాత పార్టీ మెజారిటీ స్టాలికి మద్ధతు తెలిపిన తరువాత  స్టాలిన్ సోవియట్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టాడు. స్టాలిన్ ట్రాట్స్కీని అధికార భ్రష్టుడిని చేసి 1927లో కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించాడు. మెక్సికోలో ప్రవాస జీవితం గడుపుతూ స్టాలిన్ యొక్క నిరంకుశ విధానాలను విమర్శిస్తూ వుండేవాడు. 1940లో స్టాలిన్ ఆదేశాల మీద మెక్సికోకి చెందిన సోవియట్ గూడాచారి రెమోన్ మెర్కాడర్ ఆగస్టు 21వ తేదీన ఉదయం తన ఆఫీసులో వ్రాత పనిలో నిమగ్నమైవున్న ట్రాట్స్కీని తన వద్దనున్న సుత్తెతో బలంగా నెత్తిమీద మోది హత్య చేశాడు.

ట్రాట్స్కీ అలోచనలతో "ట్రాట్క్సీయుజం" అనే వాదం ఉద్భవించింది ఈ వాదం మార్క్సిస్టు వాదాలలో ఒకటి. ఇది స్టాలినిజాన్ని వ్యతిరేకిస్తుంది. స్టాలిన్ అధ్యక్షుడిగా వున్నప్పుడు రష్యన్ చరిత్రలో ట్రాట్స్కీ ఆనవాలు లేకుండా చరిత్రను పునర్లిఖింపజేసాడు. స్టాలిన్ హయాంలో గల్లంతైన ఎందరో నాయకులను నిఖితా కృశ్చెవ్ అధ్యక్షుడిగా వున్నప్పుడు వారికి గుర్తింపు కల్పించారు. కాని ట్రాట్స్కీకి అది ఎందుకనో కల్పించలేదు. 1980లలో ట్రాట్క్సి పుస్తకాలు ముద్రణకు అవకాశం కల్పించిన కొద్ది కాలానికే వాటిని రద్దు చేసింది.

Childhood and family (1879–1895)[మార్చు]

Notes[మార్చు]

  1. Russian: Лев Дави́дович Тро́цкий, Lev Davidovich Trotsky
    Ukrainian: Лев Дави́дович Тро́цький; also transliterated Lyev, Trotski, Trotskij, Trockij and Trotzky.
  2. Лев (Лейба) Дави́дович Бронште́йн

References[మార్చు]