లీలా జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ లీలా జోషి రత్లాం జిల్లా లో రక్తహీనత తో బాధపడుతున్న గిరిజన మహిళలు, యుక్తవయస్సులో ఉన్న బాలికల కోరకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ స్త్రీ జననేంద్రియ నిపుణురాలు (గైనకాలజిస్టు), సామాజిక కార్యకర్త. మాల్వా ప్రాంతానికి చెందిన మదర్ థెరిసా అనే మారుపేరుతో పిలువబడే డాక్టర్ జోషికి 2020లో పద్మశ్రీ లభించింది.[1]

వృత్తి జీవితం

[మార్చు]

డాక్టర్ జోషి రాజస్థాన్ లోని కోటాలో భారతీయ రైల్వేలో అసిస్టెంట్ సర్జనుగా తన వృత్తిని ప్రారంభించింది.[2] ఆమె 1997లో చీఫ్ మెడికల్ డైరెక్టర్ గా రైల్వే శాఖ నుండి పదవీ విరమణ చేసింది. క్రియాశీల సేవ నుండి పదవీ విరమణ చేసిన తరువాత, డాక్టర్ జోషి మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాకు వెళ్ళింది, అక్కడ ఆమె గిరిజన మహిళలు, పిల్లలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించడం ప్రారంభించింది.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో దేశంలోని టాప్ 100 ప్రభావవంతమైన మహిళల జాబితా లో ఆమె చేర్చబడినది. 2020 లో, మధ్యప్రదేశ్ గిరిజనులలో ఆమె చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Trivedi, Vivek (2020-01-27). "Dr Leela Joshi, Mother Teresa of MP, Awarded Padma Shri for 22-Year Service to Tribal Women". News18. Retrieved 2020-02-17.
  2. Sinha, Mansi (2020-02-04). "22 सालों से आदिवासी महिलाओं का मुफ्त इलाज कर रहीं 82 साल की लीला जोशी, इन्हें मध्य प्रदेश की मदर टेरेसा कहते हैं". Dainik Bhaskar (in హిందీ). Retrieved 2020-02-17.
  3. "रतलाम की डॉक्टर लीला जोशी को पद्यश्री ..." Patrika. 26 January 2020. Retrieved 26 January 2020.
  4. "पद्मश्री से पहले कई राष्ट्रीय सम्मान मिले हैं डॉक्टर लीला जोशी को, इंदिरा गांधी ने भी दी थी शाबासी". Dainik Bhaskar. 26 January 2020. Retrieved 26 January 2020.
  5. "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
  6. "National Doctor's Day: The Medical Heroes Who Won a Padma Award in 2020". News18. Retrieved 2021-09-01.
"https://te.wikipedia.org/w/index.php?title=లీలా_జోషి&oldid=4273838" నుండి వెలికితీశారు