Jump to content

లీ క్వాన్ యూ

వికీపీడియా నుండి
(లీ క్వాన్‌ యూ నుండి దారిమార్పు చెందింది)
Lee Kuan Yew
李光耀
Lee Kuan Yew in 2002
Prime Minister of Singapore
In office
3 June 1959 – 28 November 1990
చక్రవర్తిElizabeth II (United Kingdom)
Putra (Malaysia)
అధ్యక్షుడుWilliam Goode (Governor)
Yusof Ishak
Benjamin Sheares
Devan Nair
Wee Kim Wee
DeputyToh Chin Chye
Goh Keng Swee
Goh Chok Tong
అంతకు ముందు వారుPosition established
తరువాత వారుGoh Chok Tong
Senior Minister of Singapore
In office
28 November 1990 – 12 August 2004
ప్రధాన మంత్రిGoh Chok Tong
అంతకు ముందు వారుS. Rajaratnam
తరువాత వారుGoh Chok Tong
Minister Mentor of Singapore
In office
12 August 2004 – 21 May 2011
ప్రధాన మంత్రిLee Hsien Loong
అంతకు ముందు వారుPosition established
తరువాత వారుPosition abolished
Secretary-General of the People's Action Party
In office
21 November 1954 – 1 November 1992
అంతకు ముందు వారుPosition established
తరువాత వారుGoh Chok Tong
Member of Parliament
for Tanjong Pagar GRC
Tanjong Pagar SMC (1955–1991)
In office
2 April 1955 – 23 March 2015
అంతకు ముందు వారుConstituency established
తరువాత వారుTBD
వ్యక్తిగత వివరాలు
జననం
Harry Lee Kuan Yew

(1923-09-16)1923 సెప్టెంబరు 16
Singapore, Straits Settlements
మరణం2015 మార్చి 23(2015-03-23) (వయసు 91)
Singapore General Hospital, Singapore
రాజకీయ పార్టీPeople's Action Party
జీవిత భాగస్వామిKwa Geok Choo (1950–2010)
సంతానంHsien Loong
Wei Ling
Hsien Yang
కళాశాలLondon School of Economics
Fitzwilliam College, Cambridge

సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ 1923 సెప్టెంబరు 16న పుట్టి, 91వ ఏట 2015, మార్చి 23న మరణించారు.సంపన్న సుందర సింగపూర్ నగర నిర్మాతగా ఖ్యాతి దక్కించుకున్నారు. 1959లో బ్రిటిష్ వారి నుంచి విముక్తమైన సింగపూర్‌కు మొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లీ 1990 వరకు ఆ పదవిలో ఉన్నారు[1]. ప్రజలు ప్రేమగా ఎంఎంలీ (మినిష్టర్, మెంటర్ లీ) అని పిలిచే వారు. ఆర్థిక వాణిజ్య కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషిని ఎంతోవున్నది. ఎఫిషియంట్, అన్‌సెంటిమెంటల్, ఇన్‌కరప్ట్, ఇన్‌వెంటివ్, ఫార్‌వర్డ్ లుకింగ్ అండ్ ప్రాగ్మటిక్ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2007 లో లీని కీర్తించింది. వి ఆర్ ఐడియాలజీ ఫ్రి అని లీ న్యూయార్క్ టైంస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.36వ ఏట ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 31 ఏళ్లు కొనసాగారు. ఆయన మీద కూడా అప్రజాస్వామికవాది, నియంత అనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి[2][3][4][5][6][7].

1959 నుంచి 1990 వరకూ అంటే మూడు దశాబ్దాలు పైబడి సింగపూర్‌కు ప్రధానమంత్రిగా పనిచేసిన లీ క్వాన్‌ యూ తన దీక్షా దక్షతలతో ఆ దేశాన్ని భాగ్యసీమగా మార్చేశాడు. అభివృద్ధి అంతా ఏకవ్యక్తి పాలనలో, ఏకపార్టీ ఏలుబడిలోనే జరిగింది.

బాల్యం , రాజకీయ జీవితం

[మార్చు]

ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్ సానిక్ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్ నుంచి న్యూయార్క్ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. "ఆన్ ద జాబ్ ట్రెయినింగ్" లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్ టోంగ్ కు బదలాయించారు. గో చోక్ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్ లూంగ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశాడు.[8] 1942-1945 మధ్య కాలంలో, జపాన్ ఆక్రమణ కింద సింగపూర్ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్ యూ. సింగపూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్ యూ, ఆయన సహచరులు, సింగపూర్‌ను మలయాళో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబరు 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్టు 1965 లో సింగపూర్, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్ యూ దేశ ప్ర ప్రథమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. 1990 నవంబరు 28 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్ టోంగ్ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్ మినిస్టర్ గా పనిచేశారు.

ప్రధాని పదవి వదిలేశాక ప్రపంచం నలుమూలల పర్యటించి దేశదేశాల నాయకులతో తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిలో భాగంగా లీ భారతదేశానికి పలుమార్లు వచ్చాడు. 1960 మొదలుకొని లీ పలుమార్లు భారతదేశానికి వచ్చాడు. చివరగా 2005లో భారత్‌ను సందర్శించాడు.[9] [10]

మూలాలు

[మార్చు]
  1. Terry McCarthy, "Lee Kuan Yew." Time 154: 7-8 (1999). online Archived 2015-04-02 at the Wayback Machine
  2. Reporter: Peter Day (5 July 2000). "Singapore's elder statesman". From Our Own Correspondent. BBC World Service. 
  3. Hume, Tim (20 March 2011). "The lost world of a wild tribe". Sunday Star Times. Auckland, NZ. His memoir sits on display in Singapore airport between biographies of founding statesman Lee Kuan Yew and Donald Rumsfeld
  4. "Wife of Lee Kuan Yew dies at 89". Bangkok Post. Agence France-Presse. 2 October 2010. The wife of Singapore's founding father, Lee Kuan Yew, whom the statesman called his "great source of strength and comfort"[permanent dead link]
  5. "US, Japan must help out Asia, says Kuan Yew". New Sunday Times. Kuala Lumpur. Reuters. 22 January 1998. Singapore's elder statesman Lee Kuan Yew said today...
  6. "Lagacy of Lee Kuan Yew, 1923-2015". Meet the Press. Singapore. 23 March 2015. CNBC. CNBC Asia. 
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BBCdeath అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2015-03-25.
  9. "Singapore's first PM Lee Kuan Yew not well: Report". Zee News. 16 February 2013. Retrieved 16 February 2013.
  10. Ramesh, S (15 February 2013). "Former MM Lee Kuan Yew misses Lunar New Year dinner". Channel NewsAsia. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 17 February 2013.

ఇతర పఠనాలు

[మార్చు]

ప్రాథమిక ఆధారాలు

[మార్చు]

ఇతర ఆధారాలు

[మార్చు]
[మార్చు]