లీ సన్ క్యూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీ సన్-క్యూన్
이선균
2018లో లీ
జననం(1975-03-02)1975 మార్చి 2
సియోల్, దక్షిణ కొరియా[1]
మరణం2023 డిసెంబరు 27(2023-12-27) (వయసు 48)
సియోల్, దక్షిణ కొరియా
మరణ కారణంఆత్మహత్య (కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం)
విద్యకొరియా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ – బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) నటనలో[2]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2001–2023
జీవిత భాగస్వామి
పిల్లలు2
Korean name
Hangul
Hanja
Revised RomanizationI Seon-gyun
McCune–ReischauerI Sŏnkyun
సంతకం

లీ సన్ క్యూన్ (ఆంగ్లం:Lee Sun-kyun; 1975 మార్చి 2 - 2023 డిసెంబరు 27) దక్షిణ కొరియా నటుడు. అంతర్జాతీయంగా, అకాడమీ అవార్డు విజేత బాంగ్ జూన్-హో (Bong Joon-ho) రూపొందించిన బ్లాక్ కామెడీ చిత్రం పారాసైట్ (2019)లో ఆయన నటనకు బాగా ప్రసిద్ధి చెందాడు. దీనికిగాను ఆయన తన కాస్ట్‌మేట్స్‌తో పాటు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆయన అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేషన్‌తో సహా అనేక ఇతర అవార్డులను అందుకున్నాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

లీ సన్ క్యూన్ 1975 మార్చి 2న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జన్మించాడు.[3] ఆయన 1994లో కొరియా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌ నుంచి స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు.[4] 2001లో, ఆయన స్టేజ్ మ్యూజికల్ ది రాకీ హారర్ షోలో బ్రాడ్ మేజర్స్‌గా తన రంగస్థల నటనను ప్రారంభించాడు.[5] అలాగే, ఆయన సిట్‌కామ్ లవర్స్‌తో టెలివిజన్ అరంగేట్రం చేశాడు.[4]

కెరీర్[మార్చు]

మ్యూజికల్ థియేటర్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత తెరపై చిన్న, సహాయక పాత్రలను పోషించాడు. కెబిఎస్ డ్రామా సిటీ, ఎంబిసి బెస్ట్ థియేటర్‌లలో ఏకపాత్ర నాటకాలతో ఆయన ప్రసిద్ధిచెందాడు. అలాంటి ఒక బెస్ట్ థియేటర్ ప్రాజెక్ట్‌లో, అతను టీవీ డైరెక్టర్ లీ యూన్-జంగ్‌తో కలిసి టారెంగ్ నేషనల్ విలేజ్ (2005)లో నటించాడు, ఆమె రూపొందించిన సిరీస్ కాఫీ ప్రిన్స్ (2007)లో కూడా ఆయన నటించాడు. బిహైండ్ ది వైట్ టవర్ (2007), పాస్తా (2010), గోల్డెన్ టైమ్ (2012), మై మిస్టర్ (2018) వంటి ఎన్నో విజయవంతమైన ధారావాహికలలో ఆయన నటించి మెప్పించాడు.

ఇక, పెద్ద తెరపై, ఆయన పజు (2009)లో తన పాత్రకు లాస్ పాల్మాస్ డి గ్రాన్ కానరియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు, ఆ తర్వాత మిస్టరీ థ్రిల్లర్ హెల్ప్‌లెస్ (2012), రొమాంటిక్ కామెడీ ఆల్ అబౌట్ మై వైఫ్ (2012), క్రైమ్ కమ్ బ్లాక్ కామెడీ ఎ హార్డ్ డే (2014)లలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయన దర్శకుడు హాంగ్ సాంగ్-సూతో కలిసి ఆర్ట్‌హౌస్ చిత్రాలు నైట్ అండ్ డే (2008), ఓకీస్ మూవీ (2010), నోబడీస్ డాటర్ హేవాన్ (2013) వంటి చిత్రాలు చేసాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

లీ సన్ క్యూన్ తన బాల్య స్నేహితురాలు, నటి జియోన్ హై-జిన్‌ను 2009 మే 23న వివాహం చేసుకున్నాడు.[6] వారికి ఇద్దరు మగ సంతానం.[7][8]

మరణం[మార్చు]

తన 48 సంవత్సరాల వయస్సులో లీ సన్ క్యూన్ 2023 డిసెంబరు 27న ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు. ఆయన డ్రగ్స్ వినియోగం ఆరోపనలపై దర్యాప్తు కొనసాగుతోంది.[9][10][11]

మూలాలు[మార్చు]

  1. "이선균". Cinefox (씨네폭스) (in కొరియన్). Retrieved November 1, 2023.
  2. "Outstanding Alumni". Korea National University of Arts. Archived from the original on May 8, 2014. Retrieved September 1, 2012.
  3. "이선균" [Lee Sun-kyun]. Daum 100 (in కొరియన్). Retrieved May 7, 2018.
  4. 4.0 4.1 "Parasite actor Lee Sun-kyun found dead in Seoul". The Guardian. December 26, 2023. Retrieved December 26, 2023.
  5. "LEE Sun-kyun". Korean Film Biz Zone. Retrieved September 1, 2012.
  6. Oh, Seol-hye (May 3, 2012). "Lee Sun-gyun "My wife speaks honest and direct"" Archived 2014-04-13 at the Wayback Machine. StarN News.
  7. "이선균-전혜진, 첫 아들 얻고 싱글벙글..."이목구비 뚜렷한 미남"". 매일경제 (in కొరియన్). November 25, 2009. Retrieved February 8, 2023.
  8. "이선균, 9일 새벽 둘째 득남 "산모, 아들 모두 건강"". E Today (이투데이) (in కొరియన్). August 9, 2011. Retrieved February 8, 2023.
  9. "Parasite Actor Lee Sun Kyun: పారాసైట్ ఫేమ్ లీ స‌న్ క్యున్ ఆత్మ‌హ‌త్య - డ్ర‌గ్స్‌కేసులో అరెస్ట్ - తీర్పు రాకుండానే మృతి-parasite actor lee sun kyun found dead amid drugs case allegations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్". web.archive.org. 2023-12-28. Archived from the original on 2023-12-28. Retrieved 2023-12-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Parasite actor Lee Sun-kyun found dead amid drug allegations: Yonhap". CNA. Singapore. December 27, 2023.
  11. "ఆస్కార్ మూవీ నటుడు అనుమానాస్పద మృతి | Oscar-Winning Parasite Movie Actor Lee Sun-kyun Found Dead In Car - Sakshi". web.archive.org. 2023-12-28. Archived from the original on 2023-12-28. Retrieved 2023-12-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)