Jump to content

లుకాస్ బ్రావో

వికీపీడియా నుండి
లుకాస్ బ్రావో
2023లో లుకాస్ బ్రావో
జననం
లుకాస్ నికోలస్ బ్రావో

(1988-03-26) 1988 మార్చి 26 (వయసు 36)
నైస్, ఆల్పెస్-మారిటైమ్స్, ఫ్రాన్స్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
తల్లిదండ్రులు

లుకాస్ నికోలస్ బ్రావో (ఆంగ్లం: Lucas Nicolas Bravo; జననం 1988 మార్చి 26) ఒక ఫ్రెంచ్ నటుడు. నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఎమిలీ ఇన్ పారిస్ (2020-ప్రస్తుతం)లో నటించినందుకు అతను బాగా ప్రసిద్ది చెందాడు.[1][2] అతను హాస్య-నాటక చిత్రం మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ (2022), శృంగార హాస్య చిత్రాలైన టికెట్ టు పారడైజ్ (2022), ది హనీమూన్ (2022)లలో తన చలనచిత్ర పాత్రలకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

జీవితచరిత్ర

[మార్చు]

1988 మార్చి 26న నైస్, ఆల్ప్స్-మారిటైమ్స్ లో జన్మించాడు. ఆయన రిటైర్డ్ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేనియల్ బ్రావో కుమారుడు.[3][4]

సావస్ లే సోలిల్ డి సెయింట్ ట్రోపెజ్ (2013) చిత్రంతో బ్రావొ తెరమీద అడుగుపెట్టాడు. మరుసటి సంవత్సరం, అతను కిమ్ చాపిరాన్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ హాస్య-నాటక చిత్రం లా క్రెమ్ డి లా క్రెమ్లో ఆంటోయిన్ ముఫ్లాగా కనిపించాడు.[5] 2020 నుండి, అతను నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఎమిలీ ఇన్ పారిస్లో లిల్లీ కాలిన్స్ సరసన చెఫ్ గాబ్రియేల్ గా నటిస్తున్నాడు.[6][7]

ఆంథోనీ ఫాబియన్ దర్శకత్వం వహించిన, పాల్ గల్లికో అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా లెస్లీ మాన్విల్లే, ఇసాబెల్లె హప్పెర్ట్, జాసన్ ఐజాక్లతో కలిసి మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ లో బ్రావో నటించాడు.[8][9] ది హనీమూన్, టికెట్ టు పారడైజ్ వంటి చిత్రాలలో ఆయన నటించాడు.[10][11]


ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2022 మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ ఆండ్రే ఫౌవెల్
టికెట్ టు పారడైజ్ పాల్
ది హనీమూన్ జార్జియో
2024 ది బాల్కోనెట్స్ మాగ్నాని
టీబీఏ టర్న్ అప్ ది సన్!

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర గమనిక
2013 సాస్ లె సులెలి డి సెయింట్ -ట్రొపెజ్ జెఫ్ 2 ఎపిసోడ్లు
2015 టి. ఒ. సి అడ్రియన్ 1 ఎపిసోడ్
2016 ప్లస్ బెల్లె ల వివ్ మాథ్యూ గ్రేంజ్ 1 ఎపిసోడ్
2020-ప్రస్తుతము ఎమిలీ ఇన్ పారిస్! గాబ్రియేల్ [12][13]

మూలాలు

[మార్చు]
  1. "Emily in Paris Heartthrob Lucas Bravo on Adjusting to Fame in Quarantine". PEOPLE.com.
  2. Radloff, Jessica (2 October 2020). "Meet Lucas Bravo, Your Newest TV Crush from Netflix's 'Emily in Paris' | Glamour". www.glamour.com.
  3. "Everything you need to know about Emily in Paris star Lucas Bravo". sports.yahoo.com.
  4. "My high school heartthrob was just crowned one of the sexiest men alive. Ask me how I feel". Independent.co.uk. 3 December 2020.
  5. Corey, Sarah Halle. "Ooh La La, Gabriel From 'Emily In Paris' Speaks French IRL". Elite Daily.
  6. "Emily in Paris Heartthrob Lucas Bravo on Adjusting to Fame in Quarantine". PEOPLE.com.
  7. Radloff, Jessica (2 October 2020). "Meet Lucas Bravo, Your Newest TV Crush from Netflix's 'Emily in Paris' | Glamour". www.glamour.com.
  8. "WME Signs 'Emily In Paris' Actor Lucas Bravo". October 21, 2020.
  9. Jeffrey, Joyann (22 October 2020). ""Emily In Paris" Star Lucas Bravo Talked About What It's Been Like For Him Since The Show Was Released". BuzzFeed.
  10. Roxborough, Scott (31 August 2021). "'Borat' Star Maria Bakalova Cast in Rom-Com 'The Honeymoon'". The Hollywood Reporter. Retrieved 16 September 2021.
  11. Fleming, Mike Jr. (19 October 2021). "Lucas Bravo Joins Julia Roberts & George Clooney In Working Title's 'Ticket To Paradise'". Deadline. Retrieved 20 October 2021.
  12. Del Rosario, Alexandra (April 19, 2021). "MTV Movie & TV Awards Nominations: 'Emily In Paris', 'WandaVision' & 'RuPaul's Drag Race'". Deadline (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on April 19, 2021. Retrieved April 20, 2021.
  13. "Nominees for the 8th annual National Film Awards 2022 announced". National Film Academy. 22 April 2022. Archived from the original on 1 May 2024. Retrieved 1 May 2024.