లోపలి మనిషి (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోపలి మనిషి
లోపలి మనిషి పుస్తక ముఖచిత్రం
కృతికర్త: పి.వి. నరసింహారావు
కల్లూరి భాస్కరం (తెలుగు అనువాదం)
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): జీవిత చరిత్ర
ప్రచురణ: ఎమ్మెస్కో ప్రచురణలు
విడుదల: జనవరి 18, 2002
పేజీలు: 752
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-80409-91-7


లోపలి మనిషి పుస్తకం భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఆత్మకథాత్మక నవల. నరసింహరావు ఆంగ్లంలో రచించిన ‘ది ఇన్‌సైడర్‌’ ను కల్లూరి భాస్కరం తెలుగులోకి అనువదించాడు.[1][2][3]

పుస్తకంలో[మార్చు]

1960, 70 దశాబ్ధాలలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ సామాజిక పరివర్తనానికి సంబంధించిన అనేక క్షేత్రాల్లో అవలంబించనున్న విధానాలను, వాటి అమలుకై రూపొందించిన కార్యాచరణ సూత్రాల గురించి ఇందులో విశ్లేషించాడు.

ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజా పతినిధీ, ఒక సివిల్ సర్వెంటు.. ఇలా అధికారము, అలక్ష్యము, అవినీతి వంటి విషయాల గురించి వివరించడంతోపాటూ తాను ప్రధానమంత్రిగా ఎదిగేవరకు గల తన ప్రస్థానం విస్తారంగా ప్రస్తావించాడు.

కథలోని హీరో ఆనంద్ కు పని నిబద్ధతతో (కాస్త సమయస్పూర్థి కూడా కలిపి) చేస్తూ పోవడమే కర్తవ్యం. వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా, సన్నిహితులే తనను వెన్నుపోటు పొడిచినా, ఎన్నలేనన్ని అపవాదులు తనని నీడలా వెంటాడినా, కొన్ని అసాధ్యమనిపించే పనులు చేయడానికి ఆనంద్ మాత్రమే సరిపోయే నాయకుడిగా ఇందులో చూపించడం జరిగింది. ఉథాన పతనాలు, ఎవరెస్టు అధిరోహణలు ఒకదాని వెమ్మట ఒకటి, జరిగిపోతుంటే, ఆనంద్.. తన 'తామరాకు మీద నీటి బొట్టు' వ్యక్తిత్వం మాత్రం వొదులుకోకుండా, ఒక మునిలాగా తన కర్తవ్య నిర్వహణ చేస్తూ సాగుతాడు.

నాయకుల మీద వచ్చే సెన్సేషనల్ వార్తా కథనాలు వారిని ఎంత ఒత్తిడి కలిగిస్తాయో, ఆ ఒత్తిడిని తట్టుకుని నాయకుడన్న వాడు వివేకంతో ఎలా నడుచుకోవాలో ఆనంద్ పాత్ర ద్వారా చెప్పబడింది.

అంకితం[మార్చు]

నరసింహరావు రచించిన చారిత్రాత్మక నవల, స్వీయచరిత్ర కలగలసిన ‘ఇన్‌సైడర్‌’ (లోపలి మనిషి) అనే గ్రంథాన్ని తన గురువైన స్వామి రామానంద తీర్థ అంకితమిచ్చాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి, సంపాదకీయం. "చరిత్రలో 'లోపలి మనిషి'". వకుళాభరణం కృష్ణమోహన్‌రావు. Retrieved 6 May 2018.
  2. సాక్షి (28 December 2014). "పీవీ నరసింహారావు 'లోపలి మనిషి' పుస్తక ఆవిష్కరణ". Retrieved 6 May 2018.
  3. ఎమ్మెస్కో బుక్స్. "లోపలి మనిషి". www.emescobooks.com. ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి. Retrieved 6 May 2018.

ఇతర లంకెలు[మార్చు]