Jump to content

లోలకము

వికీపీడియా నుండి
Simple gravity pendulum
An animation of a pendulum showing the velocity and acceleration vectors (v and A).

లోలకము (ఆంగ్లం Pendulum) కాలాన్ని కొలిచే గడియారం నిర్మాణంలో ప్రధానమైన సాధనము. కొన్ని గడియారాలలో ఒక లోలకం అటూ ఇటూ ఊగుతూ కనిపిస్తుంది. అది ఒక చివర నుండి మరొక చివరకు వెళ్ళి మళ్ళీ మొదటి స్థానానికి వస్తే ఒక కంపనం పూర్తి చేసిందని అంటాము. ఇలాంటి ఒక కంపనం పూర్తిచేయడానికి పట్టే కాలవ్యవధినే ఆవర్తన కాలం అంటారు. ఊయల పనిచేసే విధానం లోలకం లాగే ఉంటుంది.

1602 వ సంవత్సరంలో గెలీలియో గెలిలీ మొదటిసారిగా లోలకం మీద శాస్త్రీయ పరిశోధన చేశాడు. క్రమం తప్పకుండా అటూ ఇటూ ఊగే లోలకాన్ని కాలం కొలవడానికి వాడేవారు. 1930 దశకం దాకా కాలాన్ని కొలవడానికి ఇదే ఖచ్చితమైన మార్గంగా ఉండేది.[1] క్రిస్టియన్ హైగెన్స్ 1658 లో లోలక గడియారాన్ని కనుగొన్నాడు. దీన్ని దాదాపు 270 ఏళ్ళపాటు ఇళ్ళలోనూ, కార్యాలయాల్లోనూ వాడేవారు. తర్వాత 1930లో క్వార్ట్జ్ గడియారం కనిపెట్టేదాకా లోలక గడియారాలే సమయాన్ని కొలవడానికి విరివిగా వాడేవారు. లోలకాల్ని గడియారాల్లోనే కాకుండా యాక్సిలోమీటర్, సీస్మోమీటర్ లాంటి శాస్త్రీయ పరికరాల్లోనూ వాడుతారు.

ఆవర్తన కాలం

[మార్చు]
లోలకం కంపనపరిమితి θ0 పెరిగేకొద్దీ దాని ఆవర్తన కాలం ఎక్కువౌతుంది.

మూలాలు

[మార్చు]
  1. Marrison, Warren (1948). "The Evolution of the Quartz Crystal Clock". Bell System Technical Journal. 27 (3): 510–588. doi:10.1002/j.1538-7305.1948.tb01343.x. Archived from the original on 2011-07-17.
"https://te.wikipedia.org/w/index.php?title=లోలకము&oldid=2960321" నుండి వెలికితీశారు