లోల్ సలామ్
(లోల్ సలామ్ నుండి దారిమార్పు చెందింది)
లోల్ సలామ్ | |
---|---|
దర్శకత్వం | నాని బండిరెడ్డి |
తారాగణం | భరద్వాజ్, శ్రీనివాస్ రెడ్డి, దరహాస్ మథుర్, కివిష్ కౌటిల్య, రోహిత్ కృష్ణ వర్మ, పవన్ కుమార్ |
సంగీతం | అజయ్ అరసాడ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 6 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | జీ ఒరిజినల్ |
ఛాయాగ్రహణం | రాకేష్ ఎస్ నారాయణ |
ఎడిటర్ | వెంకటకృష్ణ చిక్కాల |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జీ5 |
వాస్తవ విడుదల | 25 జూన్ 2021 |
లోల్ సలామ్ 2021లో విడుదల కానున్న వెబ్‌సిరీస్. జీ ఒరిజినల్ పై నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు నాని బండిరెడ్డి దర్శకత్వం వహించాడు.భరద్వాజ్, శ్రీనివాస్ రెడ్డి, దరహాస్ మథుర్, కివిష్ కౌటిల్య, రోహిత్ కృష్ణ వర్మ, పవన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీరిస్ ట్రైలర్‌ను హీరో నాని 11 జూన్ 2021న విడుదల చేశాడు.[1] ఈ వెబ్‌సిరీస్ 'జీ5' ఓటీటీలో జూన్ 25న ఆరు ఎపిసోడ్లతో విడుదలైంది.[2]
కథ
[మార్చు]హైదరాబాద్ కు చెందిన ఆరుగురు స్నేహితులు ఒత్తిడి తట్టుకోలేక విహారయాత్రకు వెళ్లే క్రమంలో అనుకోని పరిస్థితుల వల్ల అడవిలో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- హర్షవర్ధన్
- వాసు ఇంటూరి
- భరద్వాజ్
- శ్రీనివాస్ రెడ్డి
- దరహాస్ మథుర్
- కివిష్ కౌటిల్య
- రోహిత్ కృష్ణ వర్మ
- పవన్ కుమార్
- పద్మిని సెట్టమ్
- ప్రవీణ,
- గాయత్రి
- ఐశ్వర్య బాల
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ ఒరిజినల్
- దర్శకత్వం: నాని బండిరెడ్డి
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ
- ఎడిటర్: వెంకటకృష్ణ చిక్కాల
- కథ-మాటలు: అర్జున్-కార్తీక్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (12 June 2021). "లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని". Namasthe Telangana. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ Eenadu (13 June 2021). "'లాల్ సలామ్' బిగ్గరగా నవ్విస్తుందా..?". EENADU. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.