Jump to content

వంది మాగదులు

వికీపీడియా నుండి

పూర్వం రాజుల కాలంలో రాజుని పొగడడానికి ఆనాడు రాజుల కొలుపులో ఉండేవారు.వీరు రాజు పక్కనే ఉంటూ రాజుని పొగుడుతూ ఉంటారు. ఉదయాన్నే సన్నాయి మేళాలతో చక్రవర్తి పొగుడుతూ మేల్కొలుపుతారు.వీరు వైశ్య పురుషుడికీ + క్షత్రియ స్త్రీ పుట్టిన సంతానం ఈ వందిమాగదులు.వీరి పని రాజులను పొగుడుతూ బతకడం వీరి ప్రధాన వృత్తి.వంది పూర్వ రోజుల గొప్పదనం చెప్పాడు. మాగది అప్పుడు పరిపాలిస్తున్న రాజును పొగుడుతూ ఉంటాడు.[1]

రాజులు వస్తున్న సమయంలో వందిమాగదులు రాజాధిరాజ, రాజగంభీర, దానవ సామ్రాజ్యనేత శ్రీశ్రీశ్రీ వృకాసుర మహారాజునకు విజయోస్తు అంటూ సభకు జయమును పలుకుతారు.[2]

వంది

[మార్చు]

రాజు ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఈ రాజు కంటే ముందు పరిపాలించిన రాజుల గొప్పతనం స్తోత్రం చేస్తాడు.అప్పుడు రాజు విని ముందు రాజుల గొప్పతనాన్ని గుర్తుచేసుకుని రాజు పొరపాటు చేయకుండా ఉంటాడు. ఇలా రాజుకు గుర్తు చేయడమే వంది పని.

మాగది

[మార్చు]

పూర్వ రాజులతో సంబంధం లేకుండా రాజు చేసిన గొప్పతనాన్ని స్తోత్రం చేస్తాడు. మాగది కేవలం రాజుని పొగడడానికి మాత్రమే ఉంటాడు. ఎవరైనా ఎక్కువ పొగడ్తలు చేస్తే వందిమాగదులు పొగడ్తలు చేయకు అని వింటూ ఉంటాం. నేడు రాజకీయ నాయకులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

మూలాలు

[మార్చు]
  1. Ranganayakamma, Muppala (1974). Ramayana visavrksam. Svithom publications.
  2. Anuradha, B. (2019-03-05). Feminist Ambedkar. Hyderabad Book Trust.