పోకచెట్టు
పోకచెట్టు | |
---|---|
Fruiting specimen | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. catechu
|
Binomial name | |
Areca catechu |
పోక చెట్టును వక్కల చెట్టు, ఘోంట, ఖపురము, క్రముకము, పూగము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం Areca catechu. ఇంగ్లీషులో Betel Palm, Areca palm, Areca-nut palm అంటారు. ఇది Arecaceae (Palm family) కుటుంబానికి చెందినది. ఇది మట్టలు ఉండే చెట్టు. ఇది ప్రసిద్ధి చెందిన పోకచెక్కలు లేక వక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వక్కలు తాంబూలం లేక కిళ్లీ లేక పాన్ లలో ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. ఇది ఒక మధ్య పరిమాణపు చెట్టు. ఇది 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని అడ్డుకొలత ఛాతి ఎత్తు వద్ద 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. రెమ్మల వలె పొడవైన వీటి ఆకులను మట్టలు అంటారు. 1.5 నుంచి 2 మీటర్ల పొడవున్న ఈ మట్టలకు ఇరుకు ఇరుకుగా అనేక రెమ్మ ఆకులు ఉంటాయి. వక్కల కోసం ఈ చెట్లను అనేక చోట్ల వాణిజ్య పంటగా పెంచుతున్నారు. వీటి విత్తనాలు క్షారకాలను (alkaloids) వక్కల నూనె (arecoline), వక్కల ఔషధం (arecaine) ల వలె కలిగి ఉంటాయి. ఇవి నమిలినప్పుడు మైకం వస్తుంది. ఇది అలవాటుగా నమిలేవారికి ఇది ఒక వ్యసనంగా మారుతుంది. ఈ చెట్టుకు కాసే పుష్పగుచ్ఛములో (ఏకలింగం) మగ, ఆడ పుష్పాలు రెండూనూ ఇదే పుష్పగుచ్ఛంలో పుట్టి ఉంటాయి. ఈ చెట్టు యొక్క పుష్పగుచ్ఛాలు ఆకులకు క్రిందుగా పూతకొమ్మకు ఎక్కువ శాఖలుగా గుంపుగా ఉంటాయి. ప్రతి శాఖ అగ్రమున కొన్ని ఆడ పుష్పాలు అడుగుభాగమున అనేక మగ పుష్పాలు పుట్టి శాఖ మొనల నుంచి వెలుపలకు వ్యాపించి ఉంటాయి. ఈ పుష్పములలోని రెండు లింగాలు ఆరు సన్నని రేకులను కలిగి కాడ లేకుండా ఉంటాయి. మీగడ తెలుపు రంగులో ఉండే ఈ పుష్పాలు పరిమళాలను వెదజల్లుతుంటాయి. మగ పుష్పాలు సూక్ష్మంగా రాలిపోయేటట్లుగా ఆరు కేశరాలు బాణం తల ఆకారం గల పరాగకోశాలను మౌలిక అండకోశంను కలిగి ఉంటాయి. ఆడ పుష్పాలు (1.2 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు) తో ఆరు చిన్న నిస్సారమైన కేశరాలను, శిఖరాగ్రం వద్ద మూడు మొనలపై త్రిభుజాకార కీలాగ్రంతో మూడు గదుల అండాశయాన్ని కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాలు అండాకారంలో ఉండి పీచును కలిగి ఉంటాయి. పరిపక్వానికి వచ్చిన ఈ పండు పసుపు రంగు నుంచి ఆరంజి లేక ఎరుపు రంగును కలిగి ఉంటాయి. ఈ పండు లోపలే వక్క ఇమిడి ఉంటుంది.
గ్యాలరీ
[మార్చు]-
19th century drawing of Areca catechu
-
An Areca catechu plantation in Taiwan
-
Areca palm at Kolkata, West Bengal, India
-
Areca palm at Kolkata, West Bengal, India
-
Areca palm fruit at Kolkata, India
-
Areca nuts from India
-
Flora de Filipinas
-
Areca catechu farm
-
Young "betel" nuts in Malaysia