Jump to content

వట్టిపల్లి మల్లినాథశర్మ

వికీపీడియా నుండి

వట్టిపల్లి మల్లినాథశర్మ తెలుగు, సంస్కృత భాషా రచయిత, అధ్యాపకుడు. వట్టిపల్లి మల్లినాథశార్మ నెల్లూరుకు సమీపంలోని ఇందుకూరుపేట నివాసి, అక్కడి ఏం.కె.ఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోధ్యాపకులుగా 1952 నుండి 1984 వరకు పనిచేశాడు. వీరు ములికినాటి బ్రాహ్మణులు, వీరి పూర్వులు చిత్తూరు జిల్లా కార్వేటినగరం దగ్గర, ముక్కరవానిపల్లె శ్రోత్రియందార్లు, ఆ సంస్థాన విద్వాంసులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మల్లినాథశర్మ చిత్తూరు జిల్లా ముక్కరవానిపల్లె లో 1926 మే 2 న వీరేశ్వరశాస్త్రి, శేషమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి జ్యోతిర్విద్యావిశారదులు. అతని పినతండ్రి నరకంఠీరవశాస్త్రి "సుగృహీత నామధేయులు, బహుశాస్త్ర పండితులు, బహుకావ్య నిర్మాతలు, సర్వదేశ ప్రసిద్ధులు" అని ఆచార్య దివాకర్ల వేంకటావధాని ప్రశంసించారు. నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో పుట్టపర్తి నారాయణాచార్యులు, కోడూరు సుబ్బరామశాస్త్రి, చివుకుల వెంకటరమణ శాస్త్రి, బండ్ల వెంకట రమణయ్య వంటి పండితులవద్ద చదువుకొన్నాడు. కురవి కృష్ణయ్య, చక్రాల లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద దేవీవరివస్యోపదేశం తీసుకొన్నాడు. మల్లినాథశర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషాప్రవీణ పట్టా పొందాడు. ఈయన కవి, పండితులు, రచయిత. ఇందుకూరుపేటలో శ్రీ వివేకానంద సేవక సంస్థ స్థాపించి, ప్రవచనాలు చేస్తూ ఆస్తికతను ప్రచారంచేశారు.

సంస్కృత ముద్రిత రచనలు

[మార్చు]
  1. కామాక్షీ సుప్రభాత ప్రపత్తిః(జన్నవాడ)
  2. కామాక్షీ సుప్రభాతం(ఇం.పేట),
  3. మధురస్మృతి,
  4. గురూపహార: (శ్రీ కామాకోటి స్వామి స్తుతి).

అముద్రిత సంస్కృత రచనలు.

[మార్చు]
  1. చాటూక్తయ:
  2. నాటికాత్రయం
  3. శ్రీనివాసగద్యం(తిరుపతి)
  4. ఋతుసంహారప్రతి
  5. కృష్ణలీలాకుల్యా,
  6. పద్మావతీ(కౌముదీనిఘంటు:)
  7. దేవీకృత శివమానసిక పూజా
  8. శివా శివస్తుతిః
  9. (శ్రీ కోలచల మల్లినాథ సూరి ప్రతిభా,
  10. భారతమాతా సుప్రభాతమ్.

తెలుగు ముద్రిత రచనలు:

[మార్చు]
  1. కామాక్షీలీలా విలాసము(జన్నవాడ-వచనం)
  2. ఆంధ్ర మధురస్మృతి(ఆరు ఆశ్వాసల కావ్యం), [2]
  3. శంకరశతకం(శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిరచిత శివమానసిక పూజకు ఛాయామాత్రానువాదం)
  4. శ్రీనివాసస్థవము,
  5. పాంథ సందేశము (శ్రీనాథకవి ప్రశస్తి),
  6. భారతకథాసంగ్రహము(తిక్కయజ్వ హరిహరనాథ తత్వ విశ్లేషణ సూచితము),
  7. జగద్గురూత్తమ శతకము),
  8. శ్రీనాథుడు-బ్రహ్మగ్జాన కళానిధి,
  9. అందరికీ తెలిసిందే! అయినా చదవండి(సంకలనం).
  10. మాత్రుస్తుతి.

తెలుగు అముద్రిత రచనలు:

[మార్చు]
  1. ఇదే ప్రపంచం (నాటిక),
  2. వసుమతి(నవల),
  3. భువనవిజయము (సంకలనము),
  4. హృదయంగమ(శృంగార పద్యాలు),
  5. చాటువులు, గ్రుడ్డిరాజుకల (పద్యాలు)

మూలాలు:

[మార్చు]
  1. https://ia601507.us.archive.org/16/items/in.ernet.dli.2015.369390/2015.369390.Abhinava-Vaasavadatta.pdf
  2. వేదం వేంకటరాయశాస్త్రి & Printing press, no4 Mallikeswarswami Gudi Lane, Lingi seetty varist, Madras.1.

వనరులు

[మార్చు]
  • బ్రహ్మగ్జాన కళానిధి,(కీ. శే. పోలంరెడ్డి యశోధర స్మృత్యంకంగా), వట్టిపల్లి మల్లినాథ శర్మ, Welcome Press, Pvt Ltd., బ్రాడీపేట, గుంటూరు2. 1990.