వనజా ఉదయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనజా ఉదయ్
జననంజనవరి 14, 1966
జాతీయతభారతీయురాలు
వృత్తికూచిపూడి నృత్యకారిణి, నృత్య అధ్యాపకురాలు

వనజా ఉదయ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నృత్య అధ్యాపకురాలు. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జననం - ఉద్యోగం[మార్చు]

వనజా ఉదయ్ 1966, జనవరి 14న హైదరాబాద్ లో జన్మించింది. తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖాధిపతిగా పనిచేస్తుంది.

నృత్యరంగం[మార్చు]

వనజా ఉదయ్ 40 సంవత్సరాలకు పైగా నృత్య రంగంలో సేవలందిస్తుంది. దాదాపు 40కిపైగా దేశాల్లో ఇప్పటి వరకు 4300కు పైగా ప్రదర్శనలిచ్చింది. 2016లో ఢిల్లీలో శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహించిన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ లో 1200 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

బిరుదులు[మార్చు]

  • నృత్యకిరణం - స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (హైదరాబాద్)[2]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 16 April 2017.
  2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు, భళా నృత్య సమ్మేళనం. "నర్తకి వనజాఉదయ్‌కి నృత్యకిరణం బిరుదు ప్రదానం". Retrieved 23 April 2017.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=వనజా_ఉదయ్&oldid=2961671" నుండి వెలికితీశారు