Jump to content

వనమహోత్సవం

వికీపీడియా నుండి

వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారు. మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతారు.

కార్తీక వనమహోత్సవం

[మార్చు]

కార్తీకమాసంలో జరిపే వనమహోత్సవంను కార్తీక వనమహోత్సవం అంటారు. కార్తీకమాసంలో జరిగే ఈ వనమహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2014 కార్తీకమాసంలో ఒక రోజున 25 కోట్ల మొక్కలను ప్రజలందరి సహకారంతో నాటించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు అందరు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అందుకోసం కార్తీకమాసంలో ఒక రోజును ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఈనాడు దినపత్రిక - 30-10-2014 - (రాష్ట్ర పండగగా కార్తీక వనమహోత్సవం)