Jump to content

వరూధిని (సినిమా)

వికీపీడియా నుండి
(వరూధిని నుండి దారిమార్పు చెందింది)
వరూధిని
(1946 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.రామానందం
నిర్మాణం నాగుమల్లి నారాయణమూర్తి,
బి.వి.రామానందం
రచన తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి
తారాగణం యస్.వి.రంగారావు,
ఎ.వి.సుబ్బారావు,
దాసరి తిలకం,
దాసరి కోటిరత్నం,
చిత్తజల్లు కాంతామణి,
రాఘవకుమారి,
అంజనీకుమారి,
కుంపట్ల,
రావులపర్తి
సంగీతం కె.భుజంగరావు
నిర్మాణ సంస్థ అనంద పిక్చర్స్
భాష తెలుగు

వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. ప్రఖ్యాత తెలుగు ప్రబంధము మనుచరిత్రములోని "వరూధిని" పాత్ర ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.


ఈ చిత్రం తయారవుతున్న సమయంలో రూపవాణిలో వచ్చిన వార్త ఇలా ఉంది [1] - "ప్రొడ్యూసర్స్ శ్రీ నాగుమిల్లి నారాయణరావు గారు, శ్రీ రామానందంగారు నవనిధులను తృణాలుగా ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమునకు అమూల్యమైన కానుకగా అందిచడానికి రాత్రింబగళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ బి.వి. రామానందంగారి దర్శకత్వంలో విద్యావంతులైన నటీనటులు, విజ్ఞాన సంపన్నులైన టెక్నీషియన్లు, మృదుమధురమైన సంభాషణలు, ఆశ్చర్యకరమగు ట్రిక్కులు, దేశీయమగు భరత నాట్యాలు - సర్వతోముఖంగా వరూధిని తెలుగువారి మన్ననలు పొందడానికి వస్తుంది."

తారాగణం

[మార్చు]

ఎస్.వి రంగారావు

ఎ.వి.సుబ్బారావు

దాసరి రామతిలకం

దాసరి కోటిరత్నం

చిత్తజల్లు కాంతామణి

రాఘవకుమారి

అంజనీకుమారి

కుంపట్ల

రావులపర్తి

శేషమాంబ

అరుణాదేవి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బి.వి . రామానందo

సంగీతం: కె.భుజంగరావు

నిర్మాతలు: నాగుమల్లి నారాయణ మూర్తి , బి.వి.రామానందo

నిర్మాణ సంస్థ: ఆనంద్ పిక్చర్స్

రచన: తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి

నేపథ్య గానం: దాసరి కోటిరత్నం, దాసరి తిలకం

విడుదల:1947: జనవరి:11.


పాటల జాబితా

[మార్చు]

1. కృష్ణా నీకు వచ్చిందా.,.. రాలేదండి, గానం. దాసరి కోటి రత్నం

2. ఈ నిరాశా విడరా భువి మనరా చీకటి చనదా వెలుగురాదా, గానం. దాసరి కోటి రత్నం

3.ఏరీతి నీ విరహాగ్ని వ్యధ సహింపజాలుదూనో, గానం.దాసరి తిలకం

4.ఘుమ ఘుమ పరిమళ మొలకా, గానం.దాసరి తిలకం బృందo

5 . చాల్ బడాయి చాల్ బడాయి చాలును లేవోయి..

6.దోరే స్వరోచి రాజే స్వరోచి జే జేలంటూ ఆడండి,,

7.నా ప్రేమసఖా ఇటురావో ఓ మధురగాయకా వినిపింపుమా,

8.పాడవే కోకిలా ప్రేమగీతము నింపుగా, గానం.దాసరి తిలకం

9.ప్రణయ జీవితభగ్న వీణా నినాదమిక వీనులకు వినిపించినా ,

పద్యాలు

10.అండజయాన నీ వోసగునట్టి సపర్యలు మాకు నచ్చే,

11.ఇంత కన్నులుండ తెరునెవ్వరినేడేద భూ సురేంద్రా,

గానం.దాసరి తిలకం

12.ఈ పాండిత్యము నీకు దక్క మరియేందే కంటివి,,

13.ఎందేడెందం కందళించు రహీచే నేకాగ్రతన్ , గానం.దాసరి తిలకం

14.దాన జపాగ్నిహోత్రి పరతంతుడనేని భవ ,

15.వారి కంటెన్ నీ మహత్యంబు ఘనమే ,

16. వెలి నెట్టిరే బాడబులు పరాశరుబట్టి దాస కన్యాకేళిత , గానం.దాసరి తిలకం .









మూలాలు

[మార్చు]

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్

వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా నటించిన ఎస్వీ రంగారావు, వరూధినిగా నటించిన దాసరి తిలకం
రూపవాణిలో ప్రకటన