వర్గం చర్చ:తెలుగు వచన కవిత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఊరకుక్క[మార్చు]

పాపం నేను చచ్చిపోయాను !
చూడండి ఎంత  హృదయవిదారకంగా
నడిరోడ్డు మీద పడి ఉందో నా శవం !

అయ్యయ్యే చచ్చిపోయావా నాతల్లీ అని
నా శవం గుండెలు నేనే బాదుకుంటుంటే
పక్కగా కార్లూ మోటార్లెక్కి పోయే మీ కళ్లల్లో
ఎక్కడయినా ఒక్క జాలితెరగానీ కదలాడుతుందేమోనని
నేను ఆశగా వెతుక్కుంటుంటే 
మీరు ముక్కు మూసుకునీ
కళ్లు అసహ్యంగా చికిలించుకునీ దూర దూరంగా పోతుంటే
నేను మళ్లీ చచ్చిపోయాను !
ఆహా ! బతికున్నరోజులే వేరని 
ఈ చావు మీద నాలుగు కళ్ల నీళ్లు రాల్చటానికయినా
బతికిన క్షణాలే లేనిదాన్ని కదా !
అవే ఉంటే 
బహుశా వేరే చావు అందమైన చావు చచ్చి ఉండేదాన్ని
ఆట బొమ్మలు లేని మీ పిల్లల చేతుల్లో
నేనొక వెలలేని కుక్కబొమ్మనై

వాళ్ల వారసత్వపు క్రూరాతి క్రూర క్రీడాశైలి శిలువనెక్కిన క్రీస్తునై

మీ పెళ్లాల మీది, మీ రహస్యాక్రమసంబంధాల మీది కసినంతా
నా బతుకో
కవిత్వాలు వ్రాయడానికి కాదు ఈ పుట. వచన కవిత్వం మీద వివరాలు వ్రాయవచ్చు. వచన కవిత్వం మీద ఉన్న వ్యాసాలన్నీ ఒక చోట కనిపించటానికి అనువుగా తయారుచేయబడ్డ వర్గపు మూసకు సంబంధించిన పేజీ ఇది. వచన కవిత్వం మీద వ్యాసం వ్రాద్దామనుకుంటే, ఇప్పటికే వచన కవిత అన్న వ్యాసం ఉన్నది, ఆ పుటలో ఇప్పటికే లేని వివరాలు పొందు పరచవచ్చు.--S I V A 13:49, 18 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]