వర్ధంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెససాంగ్ (సాహిత్యపరంగా "వర్ధంతి బల్ల") అనే ఈ బల్లను కొరియన్ వర్ధంతి కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.

మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ జరుపుకునేవి వర్థంతులు వీటిని సంవత్సరికాలు అని కూడా అంటారు, ఇవి ప్రతి సంవత్సరం వ్యక్తి మరణించిన తేది నాడు జరుపుకుంటారు. వర్ధంతిని ఆంగ్లంలో డెత్ యానివర్సరీ అంటారు. అనేక ఆసియా దేశ సంస్కృతులతో పాటు భారతదేశ సంస్కృతిలో ఒక సాంప్రదాయం వర్ధంతిని జరుపుకోవడం. పుట్టినరోజు లాగానే వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, కానీ పుట్టిన తేదీ బదులుగా ఇది ఒక కుటుంబ సభ్యుడు లేదా ఇతర ముఖ్యమైన వ్యక్తి మరణించిన తేదీ నాడు జరుపుకుంటారు. హిందూ మతానికి సంబంధించి ప్రధానంగా భారతదేశంలో వర్ధంతి నాడు హిందువులు పూర్వీకులను కొలవటం, వారి సమాధులను పూజించడం, వారి ఆశీస్సులను కోరడం వంటివి చేస్తారు, ఈ రోజున పూర్వీకుల పేరున అన్నదానం చేస్తారు. వర్ధంతిని వ్యవహారికంగా ఏడేడు అంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వర్ధంతి&oldid=3030931" నుండి వెలికితీశారు