వర్మ (పేరు)
వర్మ అనునది ధర్మసింధు [1] అను సాహిత్యం ప్రకారం సనాతన క్షత్రియ కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము. ఈ పదమునకు అర్ధము డాలు (Shield) లేక రక్షణ. వెర్మ, బర్మన్ అనునవి వర్మ యొక్క ఇతర రూపాలు. ఆధునిక యుగంలో వర్మ అను నామము ఒరిస్సా బ్రాహ్మణులు, మరియూ ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది [2].
ఫిన్నీ భాషలో వర్మ అనగా నమ్మకం అని అర్ధము. ఫిన్ లాండ్ దేశంలో వర్మ అను పదం 20 వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఆ దేశ ప్రజలు ఆగస్టు 22 న నామధేయ దినోత్సవం జరుపుకుంటారు [3]. Møre og Romsdal అను నార్వే దేశంలో వర్మ అను గ్రామం కూడా ఉంది.
కేరళ రాష్ట్రంలో వర్మ అను నామాన్ని ట్రావన్ కోర్ రాజవంశస్తులు, కొచ్చిన్ రాజవంశస్తులు పెట్టుకుంటారు. చారిత్రాత్మకంగా వర్మ అను నామాన్ని ఎక్కువగా రాజపుత్రులు, ఆంధ్ర క్షత్రియులు ఆర్య క్షత్రియులు భట్టు రాజులు వంటి క్షత్రియ కులాలవారు ధరించుకుంటారు. వర్మ అను నామాన్ని క్షత్రియేతర కులాలకు చెందిన వీరులకు, ఉద్యమకారులకు కూడా బిరుదుగా ఇచ్చేవారు. తెలంగాణా రాష్ట్రంలోని దళిత ఉద్యమ పితామహుడైన భాగ్యరెడ్డి వర్మ (1888 - 1950) దీనికి ఉదాహరణ.
ఇటీవల వడ్డేరులు, అగ్నికుల క్షత్రియులు, వెలమ వంటి సామాజిక వర్గాలవారు, దళిత వర్గాలవారు కూడా వర్మ అను నామాన్ని ధరించుకోవడం జరుగుచున్నది [4].
మూలాలు
[మార్చు]- ↑ http://www.kamakoti.org/kamakoti/articles/Dharma%20Bindu.pdf
- ↑ Sah, Ayodhya Prasad (1976). Life in mediæval Orissa, cir. A.D. 600-1200. Chaukhambha Orientalia. p. 123.
- ↑ Vilkuna, Kustaa; Huitu, Marketta; Mikkonen, Pirjo. Etunimet. Published in Joka kodin suuri nimikirja, Suuri Suomalainen Kirjakerho, Otava, Keuruu 1990. ISBN 951-643-476-2
- ↑ http://164.100.47.7/recruit/uploadeddata/19.pdf